Gaddar Awards: తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు గద్దర్ అవార్డుల(Gaddar Awards)తో సత్కరించిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటుల ప్రతిభను గుర్తిస్తూ వారికి గద్దర్ అవార్డులను పురస్కరించారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇలాంటి అవార్డులను ప్రకటించడంతో ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)చేతుల మీదుగా పలువురు సినీ సెలబ్రిటీలు గద్దర్ అవార్డులను అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, ఆటపాటలతో అందరిని సందడి చేశారు.
తెలంగాణ సంస్కృతి…
ఇక గద్దర్ అవార్డు వేడుకలలో భాగంగా ప్రముఖ సింగర్ మంగ్లీ (Singer Mangli)కూడా పాల్గొని సందడి చేశారు. ఈమె తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అద్భుతమైన పాటలు పాడుతూ అందరిని ఉర్రూతలూగించారు. ఇలా సింగర్ మంగ్లీ తన అద్భుతమైన గాత్రంతో మరోసారి తన పాట ద్వారా ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల వివాదంలో నిలిచిన మంగ్లీ ఈ వివాదం తర్వాత మొదటిసారి గద్దర్ అవార్డుల వేడుకలలో కనిపించడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
వివాదం తర్వాత మొదటిసారి బయటకు వచ్చిన మంగ్లీ…
మంగ్లీ ఇటీవల తన పుట్టినరోజు(Birthday) వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ లోని త్రిపురా రిసార్ట్ లో కుటుంబ సభ్యుల సమక్షంలోను, అత్యంత సన్నిహితుల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అయితే పెద్ద ఎత్తున డిజె పెట్టుకోవటం, అలాగే మద్యం ఉపయోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వెళ్లడంతో పోలీసులు ఒకసారిగా ఈ రిసార్ట్ పై దాడి చేశారు. ఇలా దాడి చేయడమే కాకుండా డ్రగ్స్ కూడా ఉపయోగిస్తున్నారు అనే వార్తలు బయటకు రావడం సింగర్ మంగ్లీ పై కేసు నమోదు చేయడం జరిగింది. పుట్టినరోజు వేడుకల సందర్భంగా మంగ్లీ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.
కన్నుల పండగగా గద్దర్ అవార్డులు వేడుక…
ఇక ఈ పార్టీలో ఎలాంటి విదేశీ మద్యం కానీ డ్రగ్స్ కానీ ఉపయోగించలేదని అసలు అక్కడ ఏం జరిగిందనే విషయాల గురించి మంగ్లీ చాలా క్లుప్తంగా వివరించారు. ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చేసుకున్నామె తప్ప ఎవరు అక్కడ ఎలాంటి తప్పు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై కుట్ర చేశారని కూడా ఈమె ఆరోపణలు చేశారు. ఇలా వివాదంలో చిక్కుకున్న మంగ్లీ రెండు రోజులకే తిరిగి గద్దర్ అవార్డు వేడుకలలో సందడి చేయడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎప్పటిలాగే మంగ్లీ తన పాటలతో అందరినీ ఆకట్టుకొని ఈ వేడుకలో సందడి చేశారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ వేడుక జరగడంతో తెలంగాణ ప్రభుత్వం ఎంతో అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా ఈ వేడుకను నిర్వహించారు.