Singer Pravasthi:’పాడుతా తీయగా’ ఈ షో గురించి, ఈ షో కి ఉండే గుర్తింపు గురించి , పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ టీవీ ఛానల్ లో తెలుగులో సుదీర్ఘకాలంగా రన్ అవుతున్న షో ఇది. ఇటీవలే సిల్వర్ జూబ్లీ సీరీస్ కూడా ప్రారంభమైంది. దివంగత దిగ్గజ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Bala Subrahmanyam) 1996లో మొదలుపెట్టిన ఈ షోని ఇప్పుడు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ (SP Charan) హోస్ట్ గా ముందుకు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సింగర్స్ ని ఇండస్ట్రీకి అందించిన ఈ షోపై ఇప్పుడు ప్రముఖ సింగర్ ప్రవస్తి (Singer Pravasthi) తాజాగా షాకింగ్ కామెంట్లు చేసింది. మరి ఆమె చేసిన కామెంట్లు ఏంటి? అసలు ఏం జరిగింది? ఇంత గొప్ప కార్యక్రమం పై ఆమె ఎందుకు అలాంటి కామెంట్లు చేస్తోంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
పాడుతా తీయగా నుండీ ఎలిమినేట్ అయిన ప్రవస్తి..
ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సీరీస్ ప్రారంభం అవ్వగా దీనికి మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ గ్రహీత ఎమ్.ఎమ్.కీరవాణి (MM Keeravani), ప్రముఖ సింగర్ సునీత(Sunitha ), రచయిత చంద్రబోస్ (Chandrabose) జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ షో పై సింగర్ ప్రవస్తి సంచలన కామెంట్లు చేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో సూపర్ సింగర్ తో సహా ఎన్నో షోలలో విజేతగా నిలిచిన ఈమె ఇప్పుడు ఈ షో నుండి త్వరగానే ఎలిమినేట్ అవ్వడం పై ఆడియన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈమె ఎంత గొప్ప సింగరో అందరికీ తెలిసిందే. అలాంటి ఈమె ఎలిమినేషన్ ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు ప్రవస్తి కూడా ఈ ఎలిమినేషన్ పై రియాక్ట్ అవుతూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో వరుస పోస్టులు పెడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
షో కి సపోర్ట్ లేకుండా వెళ్తే మానసిక వేదన మాత్రమే మిగులుతుంది – ప్రవస్తి
తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ప్రవస్తి..”పాడుతా తీయగా ప్రోగ్రాం కి వెళ్ళాలనుకుంటున్న సింగర్స్ అందరికీ నా సలహా ఒక్కటే.. మీకు ఏదైనా రికమండేషన్ లేదా జడ్జిల నుంచి రిఫరెన్స్ ఉంటే మాత్రమే షో లో పార్టిసిపేట్ చేయండి. ఈ రెండు లేకుండా వెళ్తే మాత్రం నీకు అన్యాయం జరుగుతుంది. మానసిక వేదన మాత్రమే మిగులుతుంది” అంటూ పోస్ట్ పెట్టింది.
మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి , సింగర్ సునీత నన్ను టార్చర్ పెట్టారు..
ఇకపోతే ఎలిమినేషన్ తర్వాత ప్రవస్తి మాట్లాడుతూ.. “మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత నన్ను సెట్ లో బాడీ షేమింగ్ చేశారు. ఇబ్బంది పెడుతున్నారు. నేను పెళ్లిలో పాట పాడితే, నన్ను చాలామంది అసహ్యంగా మాట్లాడారు. పెళ్లిలో పాటలు పాడేవాళ్లు అసలు సింగర్స్ కాదు అంటూ కూడా అవమానించారు. ఇక నన్ను ఎప్పుడూ కూడా చీడపురుగులాగే చూశారు. ఇక ప్రొడక్షన్ వాళ్లయితే చీర బొడ్డు కిందకి కట్టుకోవాలని, ఎక్స్పోజింగ్ చేయాలని ఫోర్స్ చేసేవాళ్ళు” అంటూ సింగర్ ప్రవస్తి తెలిపింది.
బాడీ షేమింగ్, అసభ్యకర ఫోటోల లీక్ పై స్పందించిన జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్..
అయితే దీనిపై జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ స్పందించింది. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ స్పందిస్తూ..” ఇలాంటి డ్రెస్లే వేసుకోవాలని షో లో సింగర్స్ కి ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. పాట నేపథ్యాన్ని బట్టి మాత్రమే కాస్ట్యూమ్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక ప్రతి వారం కూడా ఒక థీమ్ పెట్టుకుంటాము. డివోషనల్, మాస్, రెట్రో , వెస్ట్రన్ ఇలా ఒక్కో వారం ఒక్కో థీమ్ తో వస్తాము. అందుకు తగ్గట్టుగానే కాస్ట్యూమ్స్ వేసుకోమని చెబుతాము.కానీ ఇంత వల్గర్ గా బట్టలు వేసుకోమని ఏ రోజు కూడా కండిషన్ పెట్టలేదు. కానీ బాడీ షేమింగ్ గ్ చేశారు అంటూ ప్రవస్తి తెలిపింది. మేము ఎటువంటి బాడీ షేమింగ్ చేయలేదు” అంటూ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ స్పందించింది.
ప్రవస్తి పై నెటిజన్స్ ఫైర్..
ఇకపోతే షోలో ఇంతకాలం సింగర్ గా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయని హోస్ట్ ఎస్పీ చరణ్ కి చెప్పి ఉండవచ్చు. లేదా టీం తో మాట్లాడి ఉండవచ్చు. కానీ ఎలిమినేట్ అయిన తర్వాతనే ప్రవస్తి ఇలాంటి కామెంట్లు ఎందుకు చేస్తోంది అని నెటిజన్స్ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎలిమినేట్ అయిన తర్వాత సింగర్ ప్రవస్తి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.