OTT Movie : బాలీవుడ్ నుంచి వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తాయి. అందులోనూ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సినిమా అంటే, ప్రేక్షకులకు ఎక్స్పెక్టేషన్ చాలానే ఉంటుంది. కేవలం అతని నటన కోసమే సినిమాలను చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతలా ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు ఈ బాలీవుడ్ హీరో. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ సినిమా, ఒక మర్డర్ మిస్టరీ కేసు చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఇన్స్పెక్టర్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ అదరగొట్టాడు. ఉత్తరాఖండ్ లోని సుందరమైన ప్రదేశంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాకు ఇది కూడా ఒక హైలెట్ గా నిలుస్తుంది. చివరి వరకు ట్విస్టులతో సాగిపోయే ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జీ 5 (ZEE5) లో స్ట్రీమింగ్
ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రౌతు కా రాజ్’ (Rautu Ka Raaz). 2024 లో విడుదలైన ఈ సినిమాకు ఆనంద్ సురాపూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఉత్తరాఖండ్‌లోని రౌతు కీ బేలీ అనే ఊళ్లో జరుగుతుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాజేష్ కుమార్, నారాయణి శాస్త్రి, అతుల్ తివారీ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను జీ స్టూడియోస్ నిర్మించింది. ఇది 2024 జూన్ 28 నుంచి జీ 5 (ZEE5) ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
రౌతు కీ బేలీ అనే గ్రామంలో గత 30 సంవత్సరాలుగా ఎటువంటి క్రైమ్ జరిగి ఉండదు. అయితే స్థానిక సేవాధామ్ స్కూల్‌లోని వార్డెన్ సంగీతా నీహావు ఒక రోజు హఠాత్తుగా హత్యకు గురవుతుంది. ఈ కేసును విచారించే బాధ్యత ఇన్‌స్పెక్టర్ దీపక్ సింగ్ నేగీ (నవాజుద్దీన్ సిద్ధిఖీ)కి అప్పగించబడుతుంది. నేగీకి పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (PTSD) ఉంటుంది. అందువల్ల ఈ కేసు విచారణ మరింత సవాలుగా మారుతుంది. తనకు సహాయకుడిగా ఉండే, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ నరేష్ ప్రభాకర్ డిమ్రీ తో కలిసి, నేగీ ఈ హత్య మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. విచారణలో అనేక షాకింగ్ నిజాలు బయటపడతాయి. స్కూల్‌లోని అనేక మంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తారు.
కథలో అనేక ట్విస్టులు, టర్నులు వస్తూ ఉంటాయి. చివరకు ఈ హత్య వెనుక ఉన్న అసలు నేరస్తుడు ఎవరు ? వార్డెన్ ను ఎందుకు చంపాల్సివచ్చింది ? ఇన్‌స్పెక్టర్ ఈ కేసును ఎలా ఛేదిస్తాడు ?ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇన్‌స్పెక్టర్ నేగీగా తన నటనతో ఆకట్టుకున్నాడు. రాజేష్ కుమార్ తన కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాకు ఒక ఎనర్జీని తెచ్చాడు. ఇందులో క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మొత్తానికి ఈ సినిమా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఓటీటీలో అదరగొడుతోంది.
Read Also : ఆడవాళ్లను వీడియో తీసి చంపే సైకో … పోలీసులను కూడా వదలకుండా … రాధిక ఆప్టే క్రేజీ స్పై థ్రిల్లర్