BigTV English
Advertisement

Venkatesh: నిర్మాతకు 50 కోట్లు సేవ్ చేసిన వెంకీ… ఏం జరిగిందంటే..?

Venkatesh: నిర్మాతకు 50 కోట్లు సేవ్ చేసిన వెంకీ… ఏం జరిగిందంటే..?

Venkatesh: విక్టరీ వెంకటేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా దృశ్యం. మలయాళం చిత్రం దృశ్యం రీమేక్ గా ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో వెంకటేష్, మీనా జంటగా నటించారు. దృశ్యం 2 భాగాలలో వెంకటేష్ నటించి మెప్పించారు. దృశ్యం సినిమా అంటే రాంబాబు పాత్ర మనకి గుర్తొస్తుంది. దృశ్యం 3 మలయాళం లో మోహన్ లాల్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ వెంకటేష్ తో కాకుండా మోహన్ లాల్ తోనే డైరెక్ట్ డబ్ చేయాలని చూస్తున్నారు. రీమేక్ కాకుండా డబ్బింగ్ వర్షన్ తో ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగులో వెంకటేష్ తో కాకుండా దృశ్యం 3 డైరెక్ట్ డ బ్ రిలీజ్ చేస్తే అభిమానులు అంగీకరిస్తారా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది ..


అయన తో సినిమా ..50 కోట్లు సేవ్ ..

త్వరలోనే దృశ్యం 3 మలయాళంలో రాబోతుంది. తెలుగులో వెంకటేష్ రీమేక్ లేకుండా మలయాళ వెర్షన్ డైరెక్ట్ గా తెలుగులో డబ్ చేసే విధంగా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. అయితే ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయంసంగా మారింది. ట్రేడ్ వర్గాలు అంచనా ప్రకారం, మలయాళ వెర్షన్ డైరెక్ట్ గా డబ్ చేస్తే.. తెలుగులో బిజినెస్ పరంగా చూసుకుంటే.. 10 నుంచి 15 కోట్లకు మించదు. అదే తెలుగులోనే డైరెక్ట్ గా సినిమా వెంకటేష్ తో చేస్తే 50 కోట్ల బిజినెస్ జరుగుతుంది. వెంకటేష్ ఫాలోవర్స్, తెలుగు ఆడియోస్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు కలిసి వచ్చే అంశాలు. ఆయనతో సినిమా చేస్తే 50 కోట్ల వరకు బిజినెస్ జరిగి లాభాల బాట పట్టొచ్చు. మేకర్స్ మరి ఆలోచన ఏం చేస్తున్నారనేది తెలియదు గాని, ప్రస్తుతం అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు వెంకటేష్ లేకుండా దృశ్యం సినిమా చూడలేం అని, ఆయన చేయాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు. మరి మేకర్స్ ఏ విధంగా ఆలోచిస్తారో.. ఈ 50 కోట్ల డీల్ ని పోగొట్టుకుంటారో లేదో తెలియాల్సి ఉంది.


కథ విషయానికి వస్తే..

ఈ సినిమాలో రాంబాబు అనే సాధారణ కేబుల్ ఆపరేటర్, తన భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు అంజు,అనులతో అరకు ప్రాంతంలో రాజవరం గ్రామంలో నివసిస్తాడు. అతని సామాన్య జీవితం కుటుంబం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఇన్స్పెక్టర్ జనరల్ ఐజి కుమారుడైన వరుణ్ రాంబాబు కుమార్తె అంజూని వేధిస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలకు వరుణ్ అదృశ్యం అవుతాడు. దీంతో రాంబాబు కుటుంబం పోలీసుల అనుమానంలో చిక్కుకుంటుంది. వరుణ్ ఎలా అదృశమయ్యాడు. రాంబాబు తన కుటుంబాన్ని ఈప్రాబ్లమ్ నుండి ఎలా కాపాడుకున్నాడు అనేది మూవీ కథ. రెండవ భాగంలోనూ ఈ కథ కొనసాగుతుంది. వరుణ్ ని చంపింది రాంబాబు కుటుంబమే అని, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం రాంబాబు నిర్దోషిగా బయటపడడం జరుగుతుంది. ఇలా రెండు భాగాలుగా వచ్చిన కథ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. దృశ్యం అంటే రాంబాబు.. రాంబాబు అంటే వెంకటేష్ అనే విధంగా ఆడియన్స్ మదిలో నిలిచిపోయారు వెంకటేష్.

AR Rahman : ఎవరు బాధ్యులు.. AI మ్యూజిక్‌పై ఆస్కార్ విన్నర్ ఆవేదన

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×