BigTV English

Rishabh Pant – Zaheer : కోచ్ జహీర్ ఖాన్ తో రిషబ్ పంత్ గొడవ.. దూల తీర్చిన ఢిల్లీ

Rishabh Pant – Zaheer : కోచ్ జహీర్ ఖాన్ తో రిషబ్ పంత్ గొడవ.. దూల తీర్చిన ఢిల్లీ

Rishabh Pant – Zaheer :  లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్ నిన్న రాత్రి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే బ్యాటింగ్ చేయడానికి ముందు కోచ్ జహీర్ ఖాన్ తో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గొడవ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. గొడవ పెట్టుకోవడంతోనే చాలా లేటుగా బ్యాటింగ్ కి వచ్చాడు పంత్. నిన్న చివరి బంతి ఎదుర్కొన్న పంత్ డక్ ఔట్ అయి వెనుదిరిగాడు. వాస్తవానికి పంత్ క్రీజులో ఉంటే చివరి బంతుల్లో 4 లేదా సిక్స్ కొడతాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ అభిమానుల ఆశలను నెరవేర్చలేకపోయాడు పంత్.


ఈ మ్యాచ్ గురించి పరిశీలించినట్టయితే లక్నో జట్టు అంతకు ముందు తక్కువ స్కోరుకే పరిమితం అయింది. ప్రారంభంలో భారీ స్కోర్ సాధిస్తుందనుకున్న సమయంలో అనూహ్యంగా తక్కువ స్కోరు కే కట్టడి చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు. కేవలం 159 పరుగులకే పరిమితమైంది లక్నో. చివరి ఓవర్లో బదోనీ, పంత్ ఔట్ కావడం విశేషం. ఓపెనర్లు మార్క్రమ్, మార్స్ రాణించారు. 9 ఓవర్లలో 82 పరుగులు చేసింది. అప్పటికీ ఒక్క వికెట్ కూడా కోల్పేలేదు. ఓపెనర్ మార్క్రమ్ అద్భుతమైన ఫామ్ కొనసాగించాడు. మార్ష్ మాత్రం తాను ఎదుర్కొన్న తొలి 24 బంతుల్లో 32 పరుగులే చేశాడు. విధ్వంసక వీరుడు నికోలస్ పూరన్ రాగానే స్కోర్ బోర్డు పరుగులు పెడుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా పూరన్ ని స్టార్క్ ఔట్ చేయడంతో భారీ స్కోర్ నమోదు కాకుండా బ్రేక్ వేశాడు స్టార్క్.

చక చకా వికెట్లు కోల్పోయిన లక్నో జట్టు.. భారీ స్కోర్ కాదు కదా.. ఓ మాదిరి లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. చివరి 11 ఓవర్లలో కేవలం 77 పరుగులు సాధించి 6 వికెట్లు కోల్పోయింది. దీంతో పుంజుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటతీరు అద్భుతమనే చెప్పాలి. కేవలం 23 పరుగుల వ్యవధింలోనే లక్నో జట్టు 4 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన ముఖేష్ ఒకే ఓవర్ లో సమద్, మార్ష్ ను ఔట్ చేసి లక్నో ని కోలుకోలేని దెబ్బ తీశాడు. చివరి ఓవర్ లో బదోనీ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో లక్నో 160కి చేరువగా వెళ్లగలిగింది. చివరి రెండు బంతుల్లో బదోని, పంత్ ఔట్ అయ్యారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 159 పరుగులు చేసింది.


ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే.. పోరెల్ రాణించడంతో ఛేదనలో ఢిల్లీకి మంచి ఆరంభమే లభించింది. పవర్ ప్లే ముగిసే సమయానికి కరుణ్ నాయర్ ఔట్ అయ్యాడు. ఢిల్లీ 54/1 పరుగులు చేసింది. రాహుల్ తో కలిసి పోరెల్ ఇన్నింగ్స్ నడిపించాడు. రాహుల్ ఎక్కువగా సింగిల్స్ కే పరిమితమయ్యాడు. రాహుల్ తొలి 18 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఆ తరువాత గేర్ మార్చిన రాహుల్.. బిష్ణోయ్, మార్క్రమ్ బౌలింగ్ లో సిక్స్ లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 12వ ఓవర్ లో పోరెల్ ఔట్ అయినా రాహుల్, అక్షర్ చెలరేగడంతో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది.

 

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×