Singer Sunitha:’పాడుతా తీయగా’.. ఈ కార్యక్రమం పై ఇందులో జడ్జెస్ గా వ్యవహరిస్తున్న ఆస్కార్ గ్రహీతలు ఎం.ఎం.కీరవాణి (MM Keeravani), చంద్రబోస్ (Chandrabose)తో పాటు సింగర్ సునీత (Singer Sunitha)పై 19 ఏళ్ల సింగర్ ప్రవస్తి(Singer Pravasthi) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ ముగ్గురు జడ్జెస్ తనపై వివక్షత చూపించారని, అన్యాయంగా తనను ఎలిమినేట్ చేశారని ఆరోపించింది. అలాగే బాడీ షేమింగ్ చేశారు అని కూడా ప్రవస్తి తెలిపింది. ఇక ఈ ఆరోపణలకు అటు పాడుతా తీయగా టీం తో పాటు సింగర్ సునీత కూడా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సునీత మాటలకు మళ్లీ ఒక వీడియో రిలీజ్ చేసిన ప్రవస్తి ప్రశ్నల వర్షం కురిపించింది. తనపై ఎందుకు పక్షపాతం చూపించారని, ఇంకొకరు చేతిపై రాసుకు వచ్చి పాటలు పాడితే, వారిని కామెడీ చేసి, అది తప్పే కాదన్నట్టు చూశారని, ఇది పక్షపాతం కాదా అంటూ పలు రకాల ప్రశ్నలు గుప్పించింది.
ప్రవస్తికి కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత..
ఇక తర్వాత సైలెంట్ అయిన సునీత.. ఇప్పుడు మళ్లీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ షేర్ చేసింది. దీనిని మేనిపులేషన్ అంటారు అంటూ సునీత కామెంట్ చేసింది. “కొంతమంది తమ దురుసు ప్రవర్తనను మర్చిపోయి, దానికి ఎదుటి వాళ్లు ఇచ్చిన రియాక్షన్ పై ఆరోపణలు చేస్తూ ఉంటారు” అని అర్థం వచ్చేలా ఇంగ్లీష్ కొటేషన్ షేర్ చేసింది. ఇది కచ్చితంగా ప్రవస్తి గురించే పెట్టారని నెటిజన్లు కూడా అనుకుంటున్నారు. నిజానికి ప్రవస్తి ఆరోపణలపై రియాక్ట్ అయినప్పుడు కూడా సునీత ఇలాగే కామెంట్ చేశారు.
ఇదే మేనిపులేషన్ అంటే – సింగర్ సునీత..
సునీత మాట్లాడుతూ.. “ఎలిమినేషన్ అయిన తర్వాత ప్రవస్తి వాళ్ళ తల్లిని నేను దూషించానని, మీరు అని కాకుండా నువ్వు అని ఏకవచనంతో సంబోధించాను అంటూ ప్రవస్తి ఆరోపించింది. అయితే ఎలిమినేషన్ తర్వాత వాళ్ళ అమ్మగారు ఎలా బిహేవ్ చేశారు అనే విషయాన్ని ఎందుకు ప్రవస్తి బయట పెట్టలేదు. నా దగ్గరకు వచ్చి నువ్వే మోసగత్తెవి.. నీవల్లే మా అమ్మాయి ఎలిమినేట్ అయ్యింది అని, నా వైపు చేయి చూపించి మరీ ప్రవస్తి తల్లి మాట్లాడారు. అప్పుడు కూడా నేనేం అనలేదు. నమస్కారం పెట్టి వెళ్ళండి అన్నట్లు మాత్రమే చూపించాను. ఇది నా సంస్కారం” అంటూ సునీత చెప్పుకొచ్చింది. ఇక ఇలాంటి వివాదం కొనసాగుతున్న వేళ పలు యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ పాడుతా తీయగా ప్రోగ్రాం జడ్జిలపై ఆరోపణలు చేస్తుండగా.. ఆరోపణలు చేస్తుంది. ఈ మొత్తం వివాదంపై పాడుతా తీయగా ప్రొడక్షన్ హౌస్ జ్ఞాపికా ప్రొడక్షన్ వారు కూడా స్పందించి, ప్రవస్తి చేసిన ఆరోపణలు అవాస్తవాలు అంటూ చెప్పుకొచ్చింది. ఇలా మొత్తానికైతే ఈ వివాదం రోజు రోజుకి ముదురుతూనే ఉంది. ఈ వివాదానికి ఎవరు ఎప్పుడు పుల్ స్టాప్ పెడతారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.