Single Movie : యంగ్ హీరో శ్రీ విష్ణు, కేతిక శర్మ,ఇవానా హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్.. కామెడీ కథతో థియేటర్లలో రిలీజ్ అయిన మూవీ.. ఫస్ట్ డేనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. అయితే రిలీజ్ కన్నా ముందే రికార్డులను బ్రేక్ చేసింది.. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు అటు ఓవర్సీస్ లో కూడా వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తుంది.. మరి ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..
ఓవర్సీస్ లో వరుస రికార్డులు బ్రేక్..
ఓం భీమ్ బుష్ సినిమా కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. గత ఏడాది స్వాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన శ్రీవిష్ణు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. ఈ ఏడాది మాత్రం సింగిల్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన శ్రీ విష్ణు ఈ మూవీ కలెక్షన్స్ తో మరో రికార్డ్ ని బ్రేక్ చేశాడు. కేవలం ఇండియాలో మాత్రమే కాదు అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా దుమ్ము దులిపేస్తుంది.. ఇప్పటివరకు రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి తప్ప అక్కడ తగ్గడం లేదు. తాజాగా ఓవర్సీస్ లో మరో రికార్డ్ చేసింది సింగిల్ మూవీ.. శ్రీ విష్ణు మూవీకి అక్కడ హాఫ్ మిలియన్ డాలర్‌కి పైగానే వచ్చాయట. అసలు ఈ మధ్య అయితే 100k, 200k డాలర్లను కూడా వసూల్ చేయలేక ఎన్నో చిత్రాలు చతికిల పడుతున్నాయి. కాని ఈ మూవీ మాత్రం రికార్డులను సృష్టిస్తుంది.. ఏకంగా 550k వసూల్ చేస్తుంది. ఇదే జోరు కొనసాగితే మాత్రం మరింత వసూల్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్…
స్టోరీని చూస్తే..
గత కొద్ది ఏళ్లుగా హీరో శ్రీవిష్ణు డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. కామెడీ జానర్ లో వచ్చిన సినిమాలు కావడంతో ఈ హీరో ఏ సినిమా చేసిన కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చిన సింగిల్ మూవీ కూడా అదే విధంగా రెస్పాన్స్ దక్కింది.. పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ లో వర్షం కురిపించడంతో ఈ సినిమాకి క్రేజ్ పెరిగిపోతుంది. సింగిల్ మూవీ కూడా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పించింది. బ్యాంకులో మంచి ఉద్యోగం, జీతం ఉన్నా ఎందుకో సింగిల్ గానే ఉండిపోయాడు విజయ్. కార్ల షోరూం లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేసే పూర్వ ను ప్రేమిస్తాడు. కానీ.. విజయ్ ను హరిణి ప్రేమిస్తుంది.. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరి ప్రేమ గెలిచింది? ఈ ప్రేమకథలో తలెత్తిన ఇబ్బందులు? చివరికి హీరో అయ్యాడా లేదా సింగిల్గానే ఉండిపోయాడా అన్నది స్టోరీ.. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో విష్ణు క్రేజ్ పెరిగింది…