Single Movie: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు మే 9న ‘సింగిల్’ మూవీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా గీత ఆర్ట్స్ బ్యానర్ పై కార్తీక్ రాజు దర్శకత్వం లో అల్లు అరవింద్ సమర్పణలో రియాజ్ చౌదరి, విద్య కొప్పినీడి, భాను ప్రతాప్ నిర్మించారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్ గా నటించారు. తాజాగా గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలు చూద్దాం..
‘సింగిల్’ సీక్వెల్ టైటిల్ ..
సింగిల్ అంటూ శ్రీ విష్ణు థియేటర్లలో సందడి చేస్తున్నారు. విడుదలైన అన్నిచోట్ల అత్యధిక కలెక్షన్స్ తో మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. చిన్న సినిమాల అయినా మొదటి రోజు నుంచే ఇంత ఎక్కువ కలెక్షన్స్ ని సాధించడం రికార్డు అని చెప్పొచ్చు. ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను దాటింది. తాజాగా ఈ మూవీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మూవీ హీరోయిన్ కేతిక, ఇవానా ఇద్దరితో ఓ హీరోని ఫేస్ లాక్ చేసి మింగిల్ అంటూ ఫేస్ ని రివిల్ చేయకుండా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో ఇద్దరు హీరోయిన్స్ తో పాటు ఓ హీరో ఉన్నట్లు తెలుస్తుంది. హ్యాష్ ట్యాగ్ మింగిల్ అంటూ పోస్ట్ చేశారు. ఆ హీరో ఫేస్ ను రేపు 11 గంటలకు రివిల్ చేయనున్నట్లు, అనౌన్స్ చేశారు. మా ఇద్దరి హీరోయిన్స్ తో మింగిల్ కాబోతున్న హీరో ఎవరు అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచేశారు. రెడీగా ఉండండి మరో ఫన్ బ్లాస్ట్ మీ ముందుకు రాబోతుంది అని గీత ఆర్ట్స్ ప్రకటించింది. ఈ పోస్ట్ చూసిన వారంతా సింగిల్ సినిమాకి సీక్వెల్ గా హ్యాష్ మింగిల్ రాబోతుందని కామెంట్స్ పెడుతున్నారు. సినిమా ఆఖరిలో సింగిల్ 2 ఉంటుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో మింగిల్ అంటూ వీడియో రిలీజ్ చేసేసరికి నేటిజన్స్ అంతా కూడా.. సింగిల్ కి సీక్వెల్ గా మింగిల్ రాబోతుంది అంటూ కామెంట్స్ చేస్తూ ఈ పోస్టుని తెగ వైరల్ చేస్తున్నారు. కూడా అయితే సింగిల్ సినిమాకి సీక్వెల్ గా మింగిల్ అనే టైటిల్ ను మేకర్స్ చూస్ చేసుకున్నారని సమాచారం. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఆ మూవీలోను హీరోగా శ్రీ విష్ణునే అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఇద్దరు హీరోయిన్స్ తో మింగిల్ కాబోతున్న ఆ సర్ప్రైజ్ రేపు రివీల్ కానుంది.
రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ..
ఇక సింగిల్ మూవీ ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ వసూళ్లనే సాధించింది. తొలి రోజే నాలుగు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో చిన్న చిత్రాల్లో మొదటి రోజు నాలుగు కోట్లకు పైగా రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను దాటి 17 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. యుఎస్ లో కూడా ఈ చిత్రం అత్యధిక వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ మూవీ ఇలానే కొనసాగితే మరెన్నో రికార్డ్లను క్రియేట్ చేస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు. శ్రీ విష్ణు గత చిత్రాలు సామజవరగమన 50 కోట్లు కలెక్షన్స్ ని అందుకుంది. ఓంబింబిష్ 10 కోట్ల వసూలను, ఇక స్వాగ్ 7 కోట్లను సాధించింది. ఈ వేసవి బ్లాక్ బస్టర్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సింగిల్ మూవీ నిలిచింది. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ డైలాగ్స్ ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్ళడంతో శ్రీ విష్ణు క్రేజ్ మరోసారి రుజువయింది.