BigTV English

Vande Bharat Sleeper Train: తిరుపతికి వందే భారత్ స్లీపర్ రైల్.. మరి విశాఖకు?

Vande Bharat Sleeper Train: తిరుపతికి వందే భారత్ స్లీపర్ రైల్.. మరి విశాఖకు?

Indian Railways: భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చేశాయి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 135కు పైగా రైళ్లు సేవలను అందిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో దేశ వ్యాప్తంగా వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అందులో భాగంగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రైళ్లను ప్రారంభించాలని భావిస్తోంది. సికింద్రాబాద్ కేంద్రంగా రెండు రైళ్లు నడిపే విషయంలో రైల్వే సంస్థ దాదాపు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.


తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లు నడిచే మార్గాలు

⦿ సికింద్రాబాద్-పుణే మార్గం: సికింద్రాబాద్- పూణే మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని భారతీయ రైల్వే సంస్థ నిర్ణయించింది. ఈ రైలు ఈ ఏడాది చివరలో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ రైళ్లు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, అత్యంత వేగంతో ప్రయాణీకులకు సేవలను అందించనున్నాయి.   సెన్సార్ ఆధారిత లైటింగ్, సౌండ్‌ ఫ్రూఫింగ్, ఆటోమేటిక్ డోర్లు, ఎర్గోనామిక్ బంక్ బెడ్లు సహా ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంటుంది. గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. ఈ మార్గంలో ప్రస్తుతం ప్రస్తుత శతాబ్ది ఎక్స్‌ ప్రెస్ 8 గంటల 25 నిమిషాలలో గమ్యస్థానం చేరుతుండగా, వందేభారత్ స్లీపర్ రైలు ప్రయాణ సమయాన్ని కనీసం గంటకు తగ్గించనుంది.


⦿ సికింద్రాబాద్-తిరుపతి మార్గం: దేశ వ్యాప్తంగా తొమ్మిది స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్-తిరుపతి మార్గంలోనూ వందేభారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ రైలు డిసెంబర్ 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.

సికింద్రాబాద్- విశాఖపట్నం పరిస్థితి ఏంటి?

సికింద్రాబాద్-పూణే, సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ స్లీపర్ రైళ్లు నడిపే అంశంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ రెండు మార్గాల్లో రైళ్లను నడపాలని భారతీయ రైల్వే భావిస్తోంది.  కానీ, అధిక డిమాండ్ ఉన్న సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో వందేభారత్ స్లీపర్ ప్రారంభం అవుతుందా? లేదా? అనే అంశంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఇవాళ్టి వరకు సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైలుకు సంబందించి ఎలాంటి క్లారిటీ లేదు. త్వరలో ఈ దిశగా అధికారులు ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ చైర్ కార్ రైళ్లు నడుస్తున్నాయి. అందులో ఒకటి జనవరి 15, 2023న ప్రారంభించారు. దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చిన 8వ వందేభారత్ రైలు కావడం విశేషం. ఇది మంగళవారం మినహా మిగతా అన్ని రోజులు నడుస్తుంది. సుమారు 8 గంటల 35 నిమిషాల్లో 699 కి.మీ. ప్రయాణిస్తుంది. తొలుత 16 కోచ్ లుగా ఉండగా, ఆ తర్వాత 20 కోచ్ లకు అప్ గ్రేడ్ చేశారు. ఇదే మార్గంలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను మార్చి 12, 2024న ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇది దేశంలో 48వ వందేభారత్ రైలుగా అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు గురువారం మినహా మిగతా అన్ని రోజుల్లోనూ ప్రయాణిస్తుంది. తొలుత ఈ రైలు 8 కోచ్ లుగా ఉండగా, ఆ తర్వాత 16 కోచ్ లకు అప్ గ్రేడ్ చేయబడింది.

Read Also:  బుల్లెట్ ట్రైన్ కు ముహూర్తం ఫిక్స్.. పరుగులు పెట్టేది ఆ రోజు నుంచే!

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Big Stories

×