BigTV English

Shahid Afridi : ఇండియాపై యుద్ధం.. రోడ్ షో చేస్తూ రెచ్చిపోయిన పాకిస్తాన్ క్రికెటర్ ఆఫ్రిది

Shahid Afridi : ఇండియాపై యుద్ధం.. రోడ్ షో చేస్తూ రెచ్చిపోయిన పాకిస్తాన్ క్రికెటర్ ఆఫ్రిది

Shahid Afridi : భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పాకిస్తానీయులు భారత్ పై తాము విజయం సాధించామని సంబురాలు జరుపుకుంటున్నారు. చాలా మంది జాతీయ జెండాలను పట్టుకొని వీధుల్లో తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్నారు. సాయుధ దళాలను ప్రసంశిస్తూ.. కరాచీలో ర్యాలీకి నాయకత్వం వహించిన మాజీ క్రికెటర్ షాహిదీ అఫ్రిదీ ప్రముఖుల్లో ఉండటం విశేషం.  అఫ్రిదీ ర్యాలీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. అతను పాకిస్తానీ సాయుధ దళాలపై ప్రశంసలు కురిపించాడు.  వాటిని ‘విడదీయలేనిది’ అని పిలిచాడు.


Also Read :  Shubman Gill : టెస్ట్ కెప్టెన్ గా గిల్.. అంతలోపే పొగరు చూపించాడు.. ఆ లేడీ ని అవమానించి!

అప్రిది పాకిస్తానీ మీడియాతో మాట్లాడుతూ.. “మన సైన్యం ఎవరు బలవంతుడో చూపించింది. వారు (భారతీయులు) మమ్మల్ని తక్కువ అంచనా వేశారు. మా నైపుణ్యాలు లేదా మనం ఉపయోగించే సాంకేతికత గురించి వారికి తెలియదు. యుద్ధంలో పాల్గొనడానికి ప్రయత్నించండి.  ప్రపంచం ఎవరు బలవంతుడో తెలుసుకుంటుంది” అని అఫ్రిది ప్రగల్భాలు పలికాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బతినడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ నే కారణమని ఆయన ఆరోపించారు.


భారత ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ జట్లను పాకిస్తాన్ లోకి అనుమతించరు. అక్కడ మాపై చాలా ద్వేషం ఉంది. అది ఎలాంటి ఆలోచన ధోరణీ అని ప్రశ్నించాడు అప్రిది.  మరోవైపు “అమాయక పిల్లలు, పౌరులు అమరులయ్యారు. పాకిస్తానీ సైన్యం భారతీయ పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు నాకు ఒక రుజువు చూపండి?” అని ప్రశ్నించాడు. మే 7న, పాకిస్తాన్ మోర్టార్ షెల్లింగ్ ఫలితంగా నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి, ముఖ్యంగా రాజౌరి మరియు పూంచ్ జిల్లాల్లో నివసిస్తున్న పిల్లలతో సహా అనేక మంది కాశ్మీరీలు మరణించారు. మరుసటి రోజు, కుప్వారా, బారాముల్లా, ఉరి  అఖ్నూర్ జిల్లాల ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో ఒక సైనికుడితో సహా కనీసం 15 మంది భారతీయ పౌరులు మరణించారు.

సరైన విచారణ లేకుండా వాస్తవానికి భారత్.. పాకిస్తాన్ ని ఎలా నిందించగలదు అని ప్రశ్నించారు. తాను పాకిస్తాన్ సైన్యాన్ని అభినందిస్తున్నట్టు వెల్లడించారు అప్రిది. తమ దేశం శాంతిని ప్రేమించే దేశం అని.. చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ చాలా కాలం నుంచి తీవ్రవాదంతో బాధ పడుతోంది. దీంతో మనం చాలా మంది సైనికులను కోల్పోయామని తెలిపాడు అఫ్రిది. తమ దేశం శాంతిని ప్రేమించే దేశమని కూడా తెలిపాడు. పాకిస్తాన్ చాలా కాలంగా తీవ్ర వాదంతో బాధపడుతోంది. దీంతో మనం చాలా మంది సైనికులను కోల్పోయామని పేర్కొన్నాడు. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్దారీని అభినందిస్తే.. యువ రాజకీయ నాయకుడు అంతర్జాతీయ మీడియా ను ధైర్యంగా ఎదుర్కొని తన దేశానికి అండగా నిలిచారని పేర్కొన్నారు షాహిది ఆఫ్రిది.

?igsh=cXZ1bnA5ZjE5ZzZh

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×