HBD Vani Vishwanath: వాణీ విశ్వనాథ్ (Vani Vishwanath).. అందానికి తగ్గ అందం.. అంతకుమించి ధైర్యం.. సెట్ లో అందరి చేత రౌడీ అని పిలిపించుకుంటూ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు బెస్ట్ ఛాయిస్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. 90లలో తన అందంతో ఒక ఊపు ఊపిన ఈమె, రెయిన్ సాంగులకు పెట్టింది పేరుగా నిలిచింది. జగపతిబాబు(Jagapati babu), ఎన్టీఆర్ (NTR) ,చిరంజీవి(Chiranjeevi ) వంటి దిగ్గజ హీరోల సరసన నటించి భారీ పేరు సొంతం చేసుకుంది. 1971 మే 13న కేరళ త్రిశ్శూర్, ఒల్లూరు లో జన్మించిన ఈమె తండ్రి విశ్వనాథ్ ప్రముఖ జ్యోతిష్యుడు.. ఈయన దగ్గరకు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వస్తూ ఉండే శివాజీ గణేషన్ (Sivaji Ganesan).. ఈమె 9వ తరగతి చదువుతున్నప్పుడు ఈమెను చూసి ‘మన్నుక్కుల్ వైరం’ అనే సినిమాలో.. తనకు మనవరాలిగా వితంతు పాత్రలో నటింప చేశారు. బాల్య వివాహాలకు సంబంధించిన ఈ చిత్రం ఇతివృత్తం తెలిసి తన పాత్ర గురించి వాణీ బాధపడినా.. మంచి మేకప్ తో ఆ సినిమాలో ఒక డ్రీమ్ సాంగ్ పెట్టించి ఆమెను సాటిస్ఫై చేశారు. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకుంది.
వాణీ విశ్వనాథ్ వివాహం చేసుకోవాలనుకున్న ఎన్టీఆర్..
తనకు 14వ ఏట విజయ్ కాంత్ (Vijay Kanth) చిత్రంలో నటిస్తుండగా.. జగపతిబాబు ద్విపాత్రాభినయం చేస్తున్న ‘సింహస్వప్నం’ సినిమాలో అవకాశం వచ్చింది. అలా 1989లో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈమెకు.. చిరంజీవితో ‘ఘరానా మొగుడు’ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఇక్కడ తన గ్లామర్ తో అందరిని కట్టిపడేసింది. ముఖ్యంగా వాణి విశ్వనాథ్, చిరంజీవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కి యువత ఫిదా అయిపోయింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ మళ్లీ సినిమాలు రావాలని కోరుకునే అభిమానులు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా.. వాణి విశ్వనాథ్ తరంలో వేరే ఏ హీరోయిన్ కి దక్కని అదృష్టం ఈమెకి లభించింది. 1992 మే 28న స్వర్గీయ నందమూరి తారకరామారావు (Sr.NTR) పుట్టినరోజు సందర్భంగా విడుదలైన చిత్రం ‘సామ్రాట్ అశోక’. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకుంది వాణి విశ్వనాథ్. ఈ సినిమాకి ఎన్టీఆర్ దర్శకత్వం వహించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
రూమర్స్ చెక్.. అసలేం జరిగిందంటే..?
అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్, వాణి విశ్వనాథ్ మధ్య సుమారుగా 48 సంవత్సరాల వయస్సు తేడా ఉండింది. అయితే ఆ వయసు తేడాను ఎక్కడ కనిపించకుండా చాలా అద్భుతంగా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కుదిరింది.. అంటే అప్పట్లో వాణి విశ్వనాథ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతలా మెప్పించేదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా కోసం వాణీ కి ఇస్తానన్న రెమ్యునరేషన్ ను ఎన్టీఆర్ సూట్ కేస్ లో పెట్టి ఇచ్చారట. అయితే ఇంటికి వెళ్ళాక ఆ సూట్ కేసులో ఉన్న డబ్బును లెక్కించి చూస్తే.. తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం. ఇక ఆ విషయాన్ని ఆమె మళ్ళీ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి అడగగా.. ఎన్టీఆర్ కాసేపు ఆలోచించి, ఇంటికి వచ్చిన లక్ష్మిని వెనక్కి పంపించకండి.. ఏం పర్వాలేదు ఆ మొత్తం మీకే ఉంచుకోండి అని చెప్పారట. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి తోడు సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ , వాణీ విశ్వనాథ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ యువతలో ఒక సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసింది. దాంతో వాణినే ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. కానీ ఎన్టీఆర్ 1993లో లక్ష్మీపార్వతి (Lakshmi Parvati) ని వివాహం చేసుకోవడంతో ఆ రూమర్స్ కాస్త అక్కడితో ఆగిపోయాయి.
Also read:Alia Bhatt: ‘ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని తల్లి ఉంది’.. సుదీర్ఘ పోస్ట్ పంచుకున్న ఆలియా..!