Siva Sankar Master..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న అతి కొద్ది మందిలో శివశంకర్ మాస్టర్ (Siva Sankar Master) కూడా ఒకరు. ముఖ్యంగా తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎన్నో పాటలకు అద్భుతమైన స్టెప్స్ అందించి, మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 10 భాషలలో 800కు పైగా చిత్రాలకు డాన్స్ మాస్టర్ గా పనిచేశారు.అంతేకాదు 2009లో విడుదలైన ‘మగధీర’ సినిమాలోని “ధీర.. ధీర..” పాటకు గానూ 2011లో నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఒకవైపు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూనే.m మరొకవైపు పలు డాన్స్ షో లకు జడ్జిగా కూడా వ్యవహరించారు. అంతేకాదు 2003లో ‘ఆలయ్’ అనే తమిళ సినిమాతో నటుడిగా పరిచయమైన మాస్టర్ .. తర్వాత తెలుగు, తమిళ్ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కూడా పలు సినిమాలలో నటించారు. ముఖ్యంగా ఓంకార్ (Omkar), అశ్విన్ (Ashwin) వంటి వారి ఎదుగుదలకు శివ శంకర్ మాస్టర్ ఎంతో పాటుపడిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటివారు శివశంకర్ మాస్టర్ చనిపోయినప్పుడు కరోనా కారణంగా మాస్టర్ పార్థివ దేహాన్ని కూడా చూడడానికి రాలేదనే వాదనలు అప్పట్లో జోరుగా వినిపించాయి. ఇకపోతే ఇదంతా ఇలా ఉండగా శివ శంకర్ మాస్టర్ కొడుకు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, తన తండ్రి ఆశయాల గురించి, తన తండ్రి మరణం గురించి, అలాగే తన భార్య తమ ఆస్తిపై చేసిన కుట్ర గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
కరోనా సమయంలో మా నాన్న నరకం చూశారు – విజయ్ శివ శంకర్
శివశంకర్ మాస్టర్ పెద్ద కొడుకు విజయ్ శివ శంకర్ (Vijay Siva Sankar) ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విజయ్ శివ శంకర్ మాట్లాడుతూ..’ మా తాత గారిది రాజమండ్రి. అక్కడ ఆయనకు సుమారుగా 80 ఎకరాల వరకు పొలం ఉండేది. కానీ ఆ తర్వాత కాలంలో చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. మా నాన్నకు చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో వెన్నెముక విరగగా దాదాపు 12 సంవత్సరాల పాటు ఆ నరకం అనుభవించారట. తర్వాత క్రమంగా కోలుకుంటూ ఇండస్ట్రీలో సత్తా చాటారు. అయితే 2020లో మహమ్మారి కరోనా నాన్నకు సోకినప్పుడు రోజుకు 7 లక్షల రూపాయల వరకు ఖర్చయింది. ఇక కరోనా తగ్గిన తర్వాత మళ్లీ 2021లో ఆయన ఊపిరితిత్తులోకి ఇన్ఫెక్షన్ సౌకడంతో మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఆయన బ్రతుకలేదు.
ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి ఓంకార్, అశ్విన్ వంటి వారు ఎవరూ కూడా నాన్నను చూడడానికి రా” అంటూ తెలిపారు.
ALSO READ:Trinadha Rao Nakkina: ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించాలంటే భయమేస్తోంది – డైరెక్టర్..!
మా నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర చేసింది – శివశంకర్ మాస్టర్ కొడుకు..
ఇంకా విజయ్ శివశంకర్ మాట్లాడుతూ.. “మా నాన్న జీవితంలో ఏదైనా చేదు అనుభవం ఉందంటే అది నా భార్య చేసిన కుట్రే. మాకు పెళ్లి జరిగిన తర్వాత కూడా ఆమె చాలా మంచిగా ఉండేది. కానీ మాకు పాప పుట్టిన తర్వాత తను మారిపోయింది. మా నాన్నకు చాలా ఆస్తి ఉండడంతో ఒక్క కంప్లైంట్ చేస్తే ఆస్తి కొట్టేయొచ్చు అని దుర్బుద్ధి ఆమెలో పుట్టి, చెప్పుడు మాటలు విని 10 కోట్ల రూపాయలు, నాన్న కట్టించిన ఇల్లు కావాలని మా ఇంటి ముందు ధర్నా చేసింది. ఆ కారణంగా కూడా నాన్న ఎన్నో మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నా భార్య అలా మారడం వెనుక ఉన్నది ఎవరు? అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు” అంటూ తన తండ్రి ఆస్తులపై తన భార్య చేసిన కుట్ర గురించి, శివ శంకర్ మాస్టర్ గురించి విజయ్ శివశంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.