Trinadha Rao Nakkina..సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడానికి దర్శక నిర్మాతలకు కత్తి మీద సాములా పరిస్థితి మారిపోయింది. కథ, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు. అందుకే మొదటి రోజే మొదటి షో రివ్యూ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.రివ్యూ బాగా వచ్చిందంటే థియేటర్లకు ఎగబడతారు. అది ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే రివ్యూ బాగా లేదంటే థియేటర్లన్నీ బోసిపోతున్నాయి. ఇక స్టార్ హీరో మొదలుకొని యంగ్ హీరోల వరకు ఎవరైనా సరే మంచి కంటెంట్ తో వస్తేనే ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించాలంటే ఇంకెంత బాగా సినిమా తీయాలో అనే భయం వేస్తోంది. అంటూ ప్రముఖ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన (Trinadha Rao Nakkina) చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నిర్మాతగా మారిన ధమాకా డైరెక్టర్..
అసలు విషయంలోకి వెళ్తే.. మాస్ మహారాజా రవితేజ(Raviteja ) కెరియర్ లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా రికార్డ్ సృష్టించింది ‘ధమాకా’.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన త్రినాధ రావు నక్కిన తాజాగా ‘చౌర్యపాఠం’ అనే సినిమాతో నిర్మాతగా మారారు. నక్కిన నెరేటివ్స్ బ్యానర్ పై నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్రరామ్ హీరోగా ఈ సినిమా రాబోతోంది. ఎన్ వి ఎస్ ఎస్ సురేష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రైమ్, కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. తాజాగా ఈవెంట్ నిర్వహించగా.. ఆ ఈవెంట్ లో పాల్గొన్న త్రినాథరావు నక్కిన థియేటర్కు ప్రేక్షకుడిని రప్పించాలంటే భయం వేస్తోంది అంటూ కామెంట్లు చేశారు.మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించాలంటే భయం వేస్తోంది – డైరెక్టర్..
త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ.. “ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏమిటంటే.. అసలు ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో నేను పెద్దగా తిరగలేదు కానీ, ఆంధ్రప్రదేశ్లో నా సినిమాల షూటింగ్స్ కారణంగా పలు ప్రదేశాలలో తిరిగాను. అక్కడ నేను గమనించింది ఇదే. అసలు థియేటర్లకి ప్రేక్షకులు రావడం లేదు. అసలు సమస్య ఏంటో అర్థం కావడం లేదు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదు. అందుకే సెకండ్ షోలు అయితే మాక్సిమం తీసేసారు. సినిమా పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది మరి. నేనే స్వయంగా నా కళ్ళారా చూశాను. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంత కొత్త వాళ్లతో సినిమా రిలీజ్ చేయాలి అంటే అసలు భయం వేస్తోంది. స్టార్స్ సినిమాలకే రావట్లేదు. ఇక మనకెవరొస్తారు.ఈ భయం కారణంగానే ఏప్రిల్ 18వ తేదీన సినిమా విడుదల కావాల్సి ఉంది .కానీ ప్రేక్షకులు చూడటానికి వస్తారో రారో అనే భయంతో ఇప్పుడు ఏప్రిల్ 25 కి సినిమాను వాయిదా వేశాము. సాయంత్రం అయితే చాలు క్రికెట్ బాగానే చూస్తున్నారు కానీ సినిమా మాత్రం చూడడం లేదు. ముఖ్యంగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయలేకపోతున్నామా అనే అనుమానం కలుగుతుంది. అసలు రీజన్ ఏంటో తెలియడం లేదు” అంటూ తలలు పట్టుకుంటున్నారు డైరెక్టర్ త్రినాధరావు నక్కిన. మరి ఏం చేస్తే థియేటర్ కి ఆడియన్స్ వస్తారో తెలియడం లేదు అంటూ కూడా కామెంట్ చేశారు.
ఏప్రిల్ 18న విడుదల కాబోయే చిత్రాలు..
ఇకపోతే ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మొదట వీరే (చౌర్య పాఠం చిత్ర బృందం) ప్రకటించినా.. అదే రోజు కళ్యాణ్ రామ్(Kalyan Ram), విజయశాంతి(Vijayashanti ) కీలక పాత్రల్లో వస్తున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’, మొదటిసారి శివశక్తి పాత్రలో తమన్నా (Tamannaah) నటిస్తున్న ‘ఓదెల 2’ చిత్రాలతో పాటు సుమయా రెడ్డి(Sumaya Reddy) నటిస్తున్న ‘డియర్ ఉమా’ సినిమాలు కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో.. ఇన్ని సినిమాలు ఒకే రోజు విడుదలయితే.. తన సినిమా చూడడానికి ఇంకెవరు వస్తారు అన్న కారణంతోనే సినిమా వాయిదా వేశామని.. డైరెక్టర్ కం నిర్మాత వెల్లడించారు.