BigTV English

Ambati Rambabu New Business: 5 నెలల్లో 7 లక్షలు.. అంబటి తెలివికి షాక్‌లో వైసీపీ

Ambati Rambabu New Business: 5 నెలల్లో 7 లక్షలు.. అంబటి తెలివికి షాక్‌లో వైసీపీ

Ambati Rambabu New Business: అంబటి రాంబాబు .. పేరుకి సీనియర్‌మోస్ట్ పొలిటీషియన్ అయినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది రెండంటే రెండు సార్లే. అయినా తనదైన హావభావాలు, వాగ్ధాటితో పొలిటికల్‌గా ఎప్పుడూ లైమ్‌లైట్‌లోనే ఉంటారు. తన నోటి దూకుడుతోనే ఆయన జగన్‌ క్యాబినెట్‌లో చోటు దక్కించుకుని, ప్రస్తుతం మాజీ మంత్రి అనిపించుకుంటున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా, పదవి లేకపోయినా తన పనులు చక్కపెట్టుకోవడంలో దిట్ట అన్ని పేరుంది ఆయనకి. తాజాగా బాగా ఖాళీగా ఉండటంతో అంబటి కొత్త ఇన్‌కం సోర్స్ చూసుకున్నారంట . స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా కానిచ్చేస్తూ ఆదాయం పెంచుకునే పనిలో పడ్డారంట. దాంతో అంబటి తెలివితేటలపై వైసీపీ క్యాడరే షాక్ అవుతోందంట. ఇంతకీ మాజీ అమాత్యుడు ఏం చేస్తున్నారు?


జగన్ దగ్గర మార్కులు కొట్టేయడం తెలిసిన అంబటి

అంబటి రాంబాబు.. వాయిస్ ఆఫ్ వైసీపీ .. అప్పట్లో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్‌కళ్యాణ్‌లతో ఇతర ముఖ్య విపక్ష నేతల్ని తిడుతుంటే చిత్రమైన నవ్వుతో మురిసిపోయిన జగన్‌ దగ్గర మంచి మార్కులు కొట్టేయడం ఎలాగో తెలిసిన అంబటి .. దాన్ని చక్కగా వాడుకున్నారు.. సందర్భమున్నా లేకపోయినా.. అసెంబ్లీలోనూ, బయటా చంద్రబాబుపై ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకుని.. చివరి రెండేళ్లలో జగన్ కేబినెట్లో బెర్త్ దక్కించుకోగలిగారు


36 ఏళ్ల ఇండస్ట్రీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాంబాబు

అంబటి రాంబాబు పొలిటికల్ కెరీర్‌ కూడా ఆయనలాగే ఎవరికీ అంతుపట్టకుండా సాగుతూ వస్తోంది .. తన 36 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది రెండంటే రెండు సార్లే .. 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బీఎల్ చేసిన ఆ లాయర్ .. ఆ మరుసటి ఏడాది అంటే 1989లో గుంటూరు జిల్లా రేపల్లె నుంచి మొట్టమొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు .. సరిగ్గా ఆ ఎన్నికల ముందు కాపునాడు వ్యవస్ధాపకుడు వంగవీటి మోహన్ రంగా విజయవాడలో హత్యకు గురయ్యారు .. దాంతో యావత్తు రాష్ట్రం భగ్గుమంది ..

వంగవీటి రంగా సానుభూతితో అంబటికి జాక్‌పాట్

కాపు సామాజికవర్గంలో వచ్చిన వ్యతిరేకతతో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది.. కాపు సామాజికవర్గం గణనీయంగా ఉండే రేపల్లె సెగ్మెంట్లో అదే వర్గానికి చెందిన అంబటి రాంబాబుకు జాక్‌పాట్ తగిలి ఎమ్మెల్యే అయ్యారు.. అది మొదలు తిరిగి ముప్పై ఏళ్ల తర్వాత కాని ఆయన తిరిగి ఎమ్మెల్యే అవ్వలేకపోయారు…

2014లో సత్తెనపలి నుంచి పోటీ చేసి కోడెల చేతిలో ఓటమి

1994, 1999 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంబటి.. వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి పార్టీ అధికార ప్రతినిధి పోస్టులో కూర్చున్నారు.. ఇక అప్పటి నుంచి జగన్‌ వీక్‌నెస్‌ని పట్టేసి.. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి విపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుని వైసీపీ బూతు నేతల లిస్టులో ఫొకస్ అయ్యారు.. ఆ క్రమంలో 2014లో సత్తెనపల్లి టికెట్ దక్కించుకున్న ఆయన్ని టీడీపీ నుంచి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓడించారు.. తర్వాత 2019లో రెండో సారి ఎమ్మెల్యే అయ్యే భాగ్యం అంబటికి దక్కింది.. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి.. ఆ యాంటీ వేవ్‌ అంబటికి కలిసి వచ్చింది

అచ్చెన్నాయుడిని ఓడిస్తానని అసెంబ్లీలో ప్రగల్భాలు

ఎమ్మెల్యేగా గెలిచాక అంబటి నోటిదురుసు మరింత పెరిగింది .. అటు అసెంబ్లీలో ఇటు బయటా.. జగన్ ముఖం మీద నవ్వు చూడటానికన్నట్లు చంద్రబాబును పదేపదే టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు… తనకి మాత్రమే సాధ్యమైన హావభావాలతో.. విచిత్రమైన బాడీ లాంగ్వేజ్‌తో చెలరేగిపోయారు.. అంబటి వాక్చుతర్యం తెగ నచ్చేసిన జగన్ ఆయనకు 2022లో మంత్రి పదవి కూడా కట్టబెట్టేశారు.. ఏకంగా జలవనరుల శాఖ కేటాయించారు..

టీడీపీ హయాంలో 72 శాతం పూర్తి అయిన పోలవరం ప్రాజెక్టున జనవనరులు శాఖ మంత్రిగా పూర్తి చేయించలేకపోయిన అంబటి రాంబాబు.. ఆ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతున్నా ఏం చేయలేకపోయారు.. ఇప్పుడు సరిగ్గా సీన్ రివర్స్ అయింది. 11 సీట్లతో వైసీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. అచ్చెన్నాయుడ్ని కూడా ఓడిస్తామని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన అంబటి సత్తెనపల్లిలో అడ్రస్ లేకుండా పోయారు.. ఆయన అప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూ.. ఆయన్ని వెక్కిరిస్తుంది

మహళతో హస్కీగా మాట్లాడుతున్న ఆడియో హల్‌చల్

అసలు ముందు నుంచి అంబటి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గానే ఉంటూ వచ్చారు .. అంబటి రాంబాబు, ఒక మహిళ మధ్య జరిగిన హస్కీ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది … 2011లోనే ఆయన తన వీక్‌నెన్‌ ఒక స్టింగ్ ఆపరేషన్లో బయటపెట్టుకున్నారు.. మంత్రి అయ్యాక వైఎస్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్లు అమ్ముకుంటూ దొరికిపోయి.. మరోసారి పులుసులో పడి గిలాగిలా కొట్టుకున్నారు ..

ఎక్స్‌గ్రేషియా చెక్కుల్లో కమీషన్‌కు కక్కూర్తి పడ్డారని ఆరోపణలు

ఆఖరికి ఎక్స్‌గ్రేషియా చెక్కుల్లో కమీషన్‌కు కక్కూర్తి పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి .. అందుకే సరిగ్గా ఎన్నికల ముందు ఆయన రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ మీడియాకు వీడియో రిలీజ్ చేశారు.. అంబటి లాంటి వ్యక్తికి అల్లుడ్ని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నానని.. ప్రజలు బాధ్యతతో ఓటేసి సరైన నాయకుడ్ని ఎన్నుకోవాలని సూచించారు

అంబటిని సత్తెనపల్లి నుంచి మార్చేసిన జగన్

అంబటి అల్లుడు చేసిన సూచనను సత్తెనపల్లి ఓటర్లు మన్నించారు.. ఎన్నికల ముందే డ్యాన్సులు వేసేసిన మాజీ మంత్రిని చక్కగా ఓడించేశారు.. ఆ దెబ్బతో సారుని సత్తెనపల్లి నుంచి మార్చేసిన జగన్ గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షడ్ని చేశారు. సొంత సెగ్మెంట్ లేకుండా పోయిన అంబటికి ఇటీవల ప్రకటించిన వైసీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీలో స్థానం లభించలేదు. ఇప్పుడు బాగా ఖాళీగా తయారైన అంబటి రాంబాబు తన నోటి దూకుడునే క్యాష్ చేసుకునే పనిలో పడ్డారంట. సొంతగా తన పేరుతో.. అంబటి రాంబాబు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారంట.

తన డైలాగ్‌లు అప్‌లోడ్ చేయించుకుంటున్న అంబటి

ఏపీలో ఉన్న రాజకీయ నాయకుల్లో అలాంటి ఇన్‌కం సోర్స్, అసలు అలాంటి తెలివితేటలు ఉన్న నాయకుడు అంబటి రాంబాబు ఒక్కరే అంటున్నారు. తన వెటకారం, పంచ్‌ డైలాగ్‌లతో రికార్డు చేసిన వీడియోలను ప్రత్యేకంగా ఇద్దరు ఎడిటర్లను నియమించుకుని యూట్యూబ్ లో అప్‌లోడ్ చేయించుకుంటున్నారంట. అప్ లోడ్ చేసిన వీడియో లింక్‌లను వైసీపీ గ్రూపుల్లో పోస్టులు చేస్తూ వ్యూవ్స్ పెంచుకునే పనిలో పడ్డారంట. దీంతో నెలకు రూ.50 నుంచి రూ.70 వేల దాకా ఆదాయం పొందుతున్నారంట ఆ మాటల మాంత్రికుడు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే సాయంలో కూడా వాటా కోరిన రాంబాబుకు అధికారం పోవడంతో చేతిలోకి నోట్లకట్టలు రావడం కష్టంగా మారిందో ఏమో ఈ కొత్త యాపారం అయిదు నెలల క్రితమే మొదలు పెట్టారంట..

Also Read: ఆ పార్టీ నుండి రాజ్య సభకు సాయిరెడ్డి?

అంబటి తెలివి తేటలకు ముక్కున వేలేసుకుంటున్న వైసీపీ క్యాడర్

దీంతో ఏదోవిధంగా డబ్బులు సంపాదించాలనుకున్న అంబటి పొలిటికల్ పంచ్‌లతోనే ఆదాయ వనరు వెతుకున్నారంట. తన పేరుతో ఛానల్ ప్రారంభించి రాష్ట్రంలో వైసీపీకి సంబంధించిన ఏ అంశంపైనైనా వెంటనే స్పందిస్తూ, అధికార పక్షంపై నోటికొచ్చింది మాట్లాడేస్తూ సదరు వీడియోలు అప్ లోడ్ చేసేస్తున్నారంట. అలా ఛానల్ స్థాపించిన 5 నెలల్లో అంబటికి రూ.7 లక్షల ఆదాయం వచ్చిందంట. అది తెలిసి వైసీపీ క్యాడర్ అవాక్కవుతోందంట. వైసీపీపై ప్రేమతో అంబటి తన సొంత ఛానల్లో వెంటనే స్పందిస్తున్నారనుకున్న వైసీపీ కేడర్ అసలు విషయం తెలుసుకుని.. ఆయన తెలివితేటలకు ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తానికి అంబటి ఏం చేసినా వెరైటీనే.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×