BigTV English

Sivakarthikeyan: రెమ్యునరేషన్ లేకుండానే సినిమా.. కానీ అదొక్కటే కండీషన్.!

Sivakarthikeyan: రెమ్యునరేషన్ లేకుండానే సినిమా.. కానీ అదొక్కటే కండీషన్.!

Sivakarthikeyan: ఈరోజుల్లో సినిమాలకు హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ గురించే ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్లుగా మారిన తర్వాత హీరోల తీసుకునే రెమ్యునరేషన్ నిర్మాతలపై అదనపు భారంగా మారుతుందని చాలామంది మేకర్స్ ఓపెన్‌గానే స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఇక కొందరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడగానే తాము పారితోషికం తీసుకునే పద్ధతినే మార్చేస్తారు. అందులో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా యాడ్ అయ్యాడు. ‘అమరన్’ మూవీతో తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌ను సొంతం చేసుకున్నాడు శివకార్తికేయన్. అందుకే తన అప్‌కమింగ్ మూవీ రెమ్యునరేషన్ విషయంలో తానొక కీలక నిర్ణయం తీసుకున్నాడని కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.


అప్పుడే మార్పులు

ముందుగా బుల్లితెరపై ఒక యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు శివకార్తికేయన్. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు దక్కించుకున్నాడు. అలా కొన్నాళ్లకే హీరో కూడా అయ్యాడు. శివకార్తికేయన్ హీరోగా మారిన తర్వాత ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే కథలనే ఎంచుకుంటాడని, తన సినిమాలు మినిమమ్ గ్యారెంటీ హిట్లుగా నిలుస్తాయని ఇండస్ట్రీ నిపుణులు ఫిక్స్ అయిపోయారు. అలా చాలావరకు ఫీల్ గుడ, కామెడీ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శివకార్తికేయన్. కానీ మొదటిసారి తన కెరీర్‌లో ఒక బయోపిక్‌లో నటించాడు. అదే ‘అమరన్’. ఆ మూవీ తన కెరీర్‌ను మరో మలుపు తిప్పింది.


పారితోషికం వద్దు

విడుదలయ్యి 100 రోజుల పైనే అవుతున్నా ఇప్పటికీ తమిళనాడులోని పలు థియేటర్లలో ‘అమరన్’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అలా శివకార్తికేయన్ క్రేజ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం సుధా కొంగర (Sudha Kongara) దర్శకత్వంలో ‘పరాశక్తి’ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో. కొన్నిరోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం కరైకుడిలో దీని షూటింగ్ జరుగుతోంది. అయితే ‘పరాశక్తి’కి తీసుకునే రెమ్యునరేషన్ విషయంలో శివకార్తికేయన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడట. తాను ముందుగానే ఎలాంటి పారితోషికం తీసుకోకుండా మేకర్స్‌కు ఒక కండీషన్ పెట్టాడట.

Also Read: ‘మార్కో’ హీరోకు ముద్దంటే చేదా? కిస్ సీన్లు వద్దనడానికి కారణం అదేనట!

పాత పద్ధతే

‘పరాశక్తి’ (Parasakthi) కోసం ఒక రెమ్యునరేషన్ ఫిక్స్ చేయకుండా సినిమా విడుదలయిన తర్వాత వచ్చే లాభాల్లో కూడా వాటా తీసుకోవాలని శివకార్తికేయన్ ఫిక్స్ అయ్యాడట. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో లాభాల్లో వాటాలు తీసుకుంటానని శివకార్తికేయన్ చెప్పిన మాట ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇలా రెమ్యునరేషన్ కాకుండా హీరోలు లాభాల్లో వాటాలు తీసుకోవడం అనేది కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలామంది హీరోలు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. కానీ శివకార్తికేయన్ (Sivakarthikeyan) కెరీర్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఇక ‘పరాశక్తి’లో జయం రవి విలన్ రోల్‌లో కనిపించనున్నాడు. మరొక యంగ్ హీరో అయిన అథర్వ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా అలరించడానికి సిద్ధమయ్యింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×