BigTV English

Pakistan – Champions Trophy: టీమిండియా దెబ్బ అదుర్స్‌.. ఇక ఇంటికే పాక్‌.. లెక్కలు ఇవే !

Pakistan – Champions Trophy: టీమిండియా దెబ్బ అదుర్స్‌.. ఇక ఇంటికే పాక్‌.. లెక్కలు ఇవే !

Pakistan – Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా కరాచీలో జరిగిన తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమి ఇప్పుడు పాకిస్తాన్ జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. ఎందుకంటే సెమీఫైనల్ కి అర్హత సాధించే మార్గం పాకిస్తాన్ జట్టుకు ఇప్పుడు కష్టంగా మారింది. మహమ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్ లో ఓటమితో గ్రూప్ – ఏ లో చివరి స్థానానికి చేరుకుంది.


 

ప్రస్తుతం పాకిస్తాన్ నెట్ రన్ రేట్ – 1.200 గా ఉంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫార్మాట్ లో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకమైనది. ఇందులో ఒక్క ఓటమి అయినా సరే జట్టును ముంచేస్తుంది. అలా తొలి మ్యాచ్ లోనే ఓటమిని చవిచూసిన పాకిస్తాన్.. గ్రూప్ ఎ లో చివరి స్థానానికి పడిపోయింది. గ్రూప్ ఏ లో న్యూజిలాండ్ + 1.200 రన్ రేట్ తో మొదటి స్థానంలో నిలిచింది. ఇక భారత జట్టు + 0.408 రన్ రేట్ తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ మూడవ స్థానంలో, పాకిస్తాన్ అట్టడుగున నిలిచింది.


గ్రూప్ ఏ లో న్యూజిలాండ్, భారత్ చెరో రెండు పాయింట్లు సాధించగా.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు ఏమీ సాధించలేదు. ఇప్పుడు ఈ రెండు జట్లు మరోసారి ఓడిపోతే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ సెమీఫైనల్స్ చేరుకోవడం ఇప్పుడు కష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 23న భారత్ తో తలపడబోతోంది పాకిస్తాన్. అయితే సెమీఫైనల్స్ చేరుకోవాలంటే పాకిస్తాన్ జట్టు ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా భారత జట్టును ఓడించాలి. అయినప్పటికీ పాకిస్తాన్ సెమీఫైనల్స్ లో అడుగు పెట్టదు.

ఆ తర్వాత మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ గెలిచినా.. అది నెట్ రన్ రేట్ పై ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్ నెట్ రన్ రేట్ ను మెరుగుపరచుకోవడం పై దృష్టి పెట్టాలి. భారత్ పై మంచి రన్ రేట్ తో గెలుపొందినప్పటికీ.. ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు మంచి రన్ రేట్ తో గెలుపొందాలి. అప్పుడే పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. లేదంటే ఈ సీజన్ లో భారత్ లేదా బంగ్లాదేశ్ తమ మిగిలిన మూడు మ్యాచ్ లలో రెండింటిలో ఓడిపోవాలి. అలా అయితే పాకిస్తాన్ సెమిస్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

 

ఇలా జరిగితే పాకిస్తాన్ కి నాలుగు పాయింట్లు లభిస్తాయి. ఇలా కాకుండా ఫిబ్రవరి 23న భారత్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే ఈ పోటీ నుండి దాదాపుగా నిష్క్రమిస్తుంది. మరోవైపు భారత్ తో కీలక మ్యాచ్ కి ముందు పాకిస్తాన్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ గాయంతో ఈ టోర్నమెంట్ నుండి వైదొలిగాడు. అతడి స్థానంలో ఇమామ్ ఉల్ – హక్ ని తీసుకున్నారు. బుధవారం కరాచీలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఫకర్ జమాన్ చాతి కండరాలు బెనికాయి. దీంతో అతడు టోర్నమెంట్ నుండి వైదొలిగాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×