Foods For Anti Aging: యవ్వనంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ వయస్సు పెరిగే కొద్దీ ముఖంపై మొటిమలు రావడం ప్రారంభం అవుతుంది. ఫలితంగా అందం కూడా చెదిరిపోతుంది. ఇదిలా ఉంటే పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లతో పాటు పలు కారణాల వల్ల చర్మంపై ముందుగానే ముడతలు రావడం ప్రారంభం అవుతుంది. అంతే కాకుండా మెరుపు కూడా తొలగిపోతుంది. ఏజ్ పెరుగుతున్నా కూడా ముఖం అందంగా మచ్చలు లేకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలు తినడం మంచిది. ఈ పోషకాహారాలన్నీ మీ చర్మం యొక్క రంగును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా ముడతలను తగ్గించడంలో కూడా మేలు చేస్తాయి.
గ్రీన్ టీ :
గ్రీన్ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు సరిగ్గా పెరగడానికి అంతే కాకుండా కణాల నష్టాన్ని నివారించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా యవ్వనంగా కనిపించడానికి కూడా మేలు చేస్తాయి. ప్రతి రోజు గ్రీన్ టీ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ టీ మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది మీ శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుంది.
డార్క్ చాక్లెట్లు:
యవ్వనంగా ఉండాలంటే మీరు రోజు డార్క్ చాక్లెట్లు తినడం మంచిది. ఫ్లేవనాల్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండే డార్క్ చాక్లెట్లు తినడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆహారం వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా చేస్తుంది. అంతే కాకుండా మ శరీరాన్ని కూడా యవ్వనంగా మారుస్తుంది.
చిలగడ దుంప:
బీటా కెరోటిన్ చిలగడదుంపలో పుష్కలంగా ఉంటాయి. దీని సహాయంతో చర్మం సాగుతుంది. అంతే కాకుండా చర్మంపై కూడా ముడతలు రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి , ఇ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా చర్మం యొక్క రంగును కూడా మెరుగుపరుస్తాయి.
అవకాడో:
అవకాడోలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ పొడి, నిర్జీవ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి, ఇ, కె, సి, ఎ , పొటాషియం లభిస్తాయి. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ముఖం నుండి మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. మీ అందాన్ని కూడా పెంచుతుంది. మీరు దీన్ని ఫేస్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు.
Also Read: ప్రతి ఒక్కరూ తప్పకుండా వాడాల్సిన హెయిర్ మాస్క్‌లు ఇవే !
దానిమ్మ:
దానిమ్మ అనేది విటమిన్ సి , వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన పండు. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో ప్యూనికాలాజిన్స్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. అంతే కాకుండా ముఖం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.