Sai Pallavi..వరుస హిట్స్ అందుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో తనకు తానే పోటీ అన్నట్లుగా దూసుకుపోతోంది సాయి పల్లవి(Sai Pallavi).గత ఏడాది ‘అమరన్’ పాటు ఈ ఏడాది మొదట్లోనే ‘తండేల్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే బాలీవుడ్లో రెండు మూడు సినిమాలు చేస్తూనే.. మరోపక్క సౌత్ లో కూడా చాలా బిజీబిజీగా గడుపుతోంది . ఇకపోతే సినీ కెరియర్ పరంగా బిజీగా మారిన సాయి పల్లవి వివాహం ఎప్పుడు చేసుకుంటుంది అని అభిమానులు సైతం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సాయి పల్లవి తాజాగా తన మనసులో ఉన్న కోరిక బయట పెట్టింది. ముఖ్యంగా తన పెళ్లిలో తన తల్లి పెళ్లి చీరే ప్రత్యేక మంటూ చెప్పి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తన తల్లి ఇచ్చిన చీర కోసం ఎప్పటికైనా అది సాధించాలని అనుకుంటున్నట్టు సాయి పల్లవి మాట్లాడిన మాటలు చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాయి. మరి ఇంతకీ సాయి పల్లవి తల్లి ఇచ్చిన చీర వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..
నా పెళ్ళిలో ఆ చీరే ప్రత్యేకం..
లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి (Sai Pallavi) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, తల్లి ప్రేమతో ఇచ్చిన చీర వెనుక ఉన్న స్టొరీ బయట పెట్టింది..”మా అమ్మ నాకు 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రేమతో ఒక మంచి చీర కొనిపెట్టింది. ఈ చీర నువ్వు నీ పెళ్లిలో కట్టుకోవాలి అని చెప్పింది. అయితే మా అమ్మ నాకు చీర ఇచ్చిన సమయంలో నేనింకా సినిమాల్లోకి రాలేదు.కానీ ఆ తర్వాత 3ఏళ్లకు సినిమాల్లోకి వచ్చాక.. మా అమ్మ ప్రేమతో ఇచ్చిన చీరను నా నటనను మెచ్చి ఇచ్చే ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం కట్టుకోవాలి అనుకున్నాను. అయితే ఆ ప్రతిష్టాత్మకమైన అవార్డు అంటే నేషనల్ అవార్డు.. కాబట్టి జాతీయ అవార్డు వచ్చిన సమయంలో ఈ చీర కట్టుకొని ఆ అవార్డు అందుకోవాలి అని నేను అనుకున్నాను. కానీ మొదటి సినిమా ప్రేమమ్ (Premam)తోనే నాకు మంచి గుర్తింపు రావడంతో ఎప్పటికైనా మా అమ్మ ఇచ్చిన చీర కట్టుకొని అవార్డు అందుకుంటాను అనే నమ్మకం నాలో కలిగింది. ఇక నా నటనకి అవార్డు వచ్చినా రాకపోయినా కూడా చీర కట్టుకునే విషయంలో మాత్రం నా మీద ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే చీర కట్టుకోవడం కోసమైనా.. నా నటనతో మెప్పించి ఆ అవార్డుని అందుకోవాలి అని నేను అనుకుంటున్నాను ” అంటూ సాయి పల్లవి (Sai Pallavi)మాట్లాడిన మాటలు ప్రస్తుతం చాలామందిని ఆకర్షిస్తున్నాయి.
జాతీయ అవార్డు విషయంలో సాయి పల్లవికి ఎప్పుడూ అన్యాయమేనా..?
అయితే జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డులు చాలాసార్లు సాయి పల్లకి వస్తాయని వార్తలు వచ్చాయి.కానీ ప్రతిసారి సాయి పల్లవికి అన్యాయం జరుగుతూనే వస్తుంది. ఎందుకంటే గార్గి(Gargi) సినిమా విషయంలో సాయి పల్లవికి అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు.కానీ ఆ అవార్డు నిత్యమీనన్ (Nithya Menon) కి వచ్చింది.అంతేకాదు శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి పోషించిన పాత్రకి నేషనల్ అవార్డు వస్తుందని చాలామంది అనుకున్నారు.కానీ ఆ సమయంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లో నటించిన పూజ హెగ్డే (Pooja Hegde)కి నేషనల్ అవార్డు రావడంతో చాలామంది పూజ హెగ్డే డబ్బులు పెట్టి అవార్డు కొనుక్కుందని, అది సాయి పల్లవికి రావాల్సిన అవార్డు అని , సాయి పల్లవికి అన్యాయం చేశారంటూ వార్తలు వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే సాయి పల్లవి(Sai Pallavi) ఎప్పటికైనా తన నటనతో నేషనల్ అవార్డు అందుకోవాలి అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.