Shivangi Teaser:ఒకప్పుడు తెలుగు హీరోయిన్ లకు పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు. కానీ ఈ మధ్యకాలంలో తెలుగు హీరోయిన్స్ తమ నటనతో విజృంభిస్తున్న నేపథ్యంలో.. అవకాశాలు కూడా వారిని తలుపు తడుతున్నాయి. ఇక అలాంటి వారిలో తెలుగమ్మాయి ఆనంది(Anandi) కూడా ఒకరు. తెలుగు, తమిళ్ భాషలలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్న ఈమె.. తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) తో కలిసి శివంగి (Sivangi) అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవరాజు భరణి ధరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో డాక్టర్ కోయా కిషోర్, జాన్ విజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ లో డైలాగ్స్ మాత్రం బాగా పేలుతున్నాయి. ముఖ్యంగా ఈ టీజర్ చూసిన సినిమా లవర్స్ కి, మీమర్స్ కి పెద్ద పండగే అని చెప్పవచ్చు.
Unni Mukundan : అభిమానిపై అంత కోపమా హీరో గారూ… బాలయ్యను చూసి నేర్చుకున్నారా?
థియేటర్ లలో పేలనున్న డైలాగ్స్..
టీజర్ లోని డైలాగ్స్ విషయానికి వస్తే.. ముఖ్యంగా ఆనంది చెప్పే డైలాగు హైలెట్ గా మారింది. “వంగే వాళ్లు ఉన్నంతవరకు.. మింగే వాళ్లు కూడా ఉంటారు. కానీ నేను వంగే రకం కాదు.. మింగే రకం ” అంటూ ఆనంది చెప్పే డైలాగ్ టీజర్ కే హైలెట్గా నిలిచింది. ఇక ఈ టీజర్ చూస్తూ ఉంటే.. ఇంతకుముందు వచ్చిన కథలాగా కనిపించడం లేదు. చాలా కొత్తగా తీసినట్టు అనిపిస్తోంది. ఇకపోతే ఇందులో ఆనంది ఒక భార్య పాత్రలో నటించింది. ఇక భార్య పాత్రలో ఆనందికి వచ్చిన కష్టాలేంటి? అలా కష్టాలు ఎదురైనప్పుడు.. ఆమె ఏం చేసింది? అనేది ఈ సినిమా కథ.. వరలక్ష్మీ శరత్ కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
ఆనంది కెరియర్..
హీరోయిన్ ఆనందికి తల్లిదండ్రులు పెట్టిన పేరు రక్షిత. అయితే ఆమె ఆనందిగా పేరు మార్చుకుంది. ఇక 2012లో ‘బస్ స్టాప్’ అని తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత 2014లో పోరియాలన్ అనే సినిమాలో నటించి అటు తమిళ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అదే సంవత్సరం ప్రభు సోలమన్ చిత్రం ‘కాయల్’ సినిమా ఈమెకు మంచి విజయం అందించడంతో ఈమె పేరు బాగా మారుమ్రోగిపోయింది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఈ చిత్రానికి ప్రత్యేక బహుమతి కూడా అందుకుంది. వరంగల్లులో ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన ఆనంది, సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2021 జనవరి 7న తెలంగాణలోని వరంగల్ లో సోక్రటీస్ ను వివాహం చేసుకున్నారు. ఈయన మెరైన్ ఇంజనీర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్గా , తత్వవేత్తగా కూడా మంచి పేరు దక్కించుకున్నారు. ఆనంది, సోక్రటీస్ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇక తెలుగులో ఈ రోజుల్లో, బస్ స్టాప్ ,ప్రియతమా నీవచట కుశలమా, నాయక్, గ్రీన్ సిగ్నల్, జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, అదృష్టం, తెల్ల గులాబీ వంటి చిత్రాలలో నటించిన ఈమె భైరవంతో పాటు శివంగి అనే సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతోంది.