BigTV English

Unni Mukundhan : అభిమానిపై అంత కోపమా హీరోగారు… బాలయ్యను చూసి నేర్చుకున్నారా?

Unni Mukundhan : అభిమానిపై అంత కోపమా హీరోగారు… బాలయ్యను చూసి నేర్చుకున్నారా?

Unni Mukundhan : సాధారణంగా అప్పుడప్పుడు అభిమానులు చేసే పనికి సీరియస్ అవుతూ ఉంటారు సెలబ్రిటీలు.ఆ కారణాల వల్లే వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కూడా ఒక అభిమాని చేసిన పనికి.. హీరో ఉన్ని ముకుందన్ సీరియస్ అయ్యారు. ఆ కోపంలో హీరో ఏం చేస్తారో తెలిస్తే మాత్రం షాక్ అవ్వక మానరు. ఈ విషయం చూసి కొంతమంది అంత కోపం ఎందుకు గురూ అని కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది అలా చేయాల్సిందేలే అంటూ హీరోకి సపోర్ట్ పలుకుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


అభిమాని ఫోన్ లాగేసుకున్న హీరో..

‘మార్కో’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు మళయాళ హీరో ఉన్ని ముకుందన్. ఈ సినిమాతో ఆయన క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇదిలా ఉండగా ఈ స్టార్ హీరోకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇది చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్ బాక్స్ ను నింపేస్తున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే, ఒక మాల్ లో ఉన్ని ముకుందన్ తో ఫోటో దిగడానికి ఒక అభిమాని ప్రయత్నించాడు. ఇందుకోసం హీరో ముఖం మీద కెమెరా పెట్టేసాడు. దీంతో కోపం వచ్చిన ఉన్ని ముకుందన్ తీవ్ర అసౌకర్యానికి గురై.. వెంటనే సదరు అభిమాని ఫోన్ లాక్కొని జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు. ఇక చివరికి అభిమాని వేడుకోవడంతో కొద్దిగా ముందుకు వెళ్లాక మళ్ళీ అభిమాని ఫోను ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇది పాత వీడియోనా? లేక కొత్త వీడియోనా? అన్నది క్లారిటీ లేదు. కానీ మొత్తానికి అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఇది చూసిన నెటిజెన్స్ ఉన్ని ముకుందన్ మరీ ఇంత యారోగెంట్ గా ప్రవర్తించాల్సింది కాదు అంటూనే.. అభిమాని తప్పు కూడా ఉంది అని చెబుతున్నారు. మరి అలా మొహం మీద కెమెరా పెట్టడం ఎంతవరకు సబబు అని కూడా ప్రశ్నిస్తున్నారు.. ఏది ఏమైనా ఉన్ని ముకుందన్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరికొంతమంది బాలయ్య ని చూసి నేర్చుకున్నాడేమో అంటూ కూడా సరదాగా కామెంట్లు చేస్తున్నారు.


మార్కో సినిమా విశేషాలు..

ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో మోస్ట్ వైలెంట్ చిత్రంగా మార్కో రికార్డు సృష్టించింది. అంతేకాదు మలయాళం సినీ ఇండస్ట్రీలోనే ఈ సినిమా ఒక సరికొత్త సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో చూపించిన వయలెన్స్ ఇప్పటివరకు మలయాళం ప్రేక్షకులు రుచి చూడలేదు. దీంతో ఈ విషయం ఈ సినిమాకు బాగా ప్లస్ అయిందని చెప్పాలి. అటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా విడుదలయి సంచలనం సృష్టించింది. ఈ సినిమా దెబ్బకు కీర్తి సురేష్ (Keerthy Suresh) మూవీ ‘బేబీ జాన్’ కూడా థియేటర్ల నుండి తప్పుకుంది అంటే ఇక ఏ రేంజ్ లో సినిమా అక్కడి ఆడియన్స్ ను మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేయడంతో హీరో పేరు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×