Jagan Silent: ఏపీలో అధికారం పోయి తొమ్మిది నెలల తర్వాత వైసీపీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది. ఇంట్లో ఉంటే కష్టమని భావించి అధినేత, జనంలోకి వెళ్లడం మొదలుపెట్టారు. ఆయన వెంటనే మిగతా నేతలు అడుగులు వేస్తున్నారు. పరిస్థితి బట్టి ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆలోచన చేస్తోంది. ఆ విధంగా ప్రజలకు దగ్గరకు కావాలని భావిస్తోంది. అందుకు సంబంధించి తెర వెనుక పనులు చకచకా జరిగిపోతున్నాయి.
వైసీపీ అధినేత జగన్ రూటు మార్చినట్టు కనిపిస్తోంది. గడిచిన తొమ్మిది నెలలు తాడేపల్లి టు బెంగుళూరుకి పరిమితమయ్యారు. ఇలాగైతే కష్టమని భావిస్తున్నారాయన. నేతల కంటే తాను ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని భావిస్తున్నారట. అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నారు. కాకపోతే మీడియా నుంచి పెద్దగా సపోర్టు లేకపోవడంతో.. కేవలం సోషల్ మీడియానే నమ్ముకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో చాలా సంస్థలతో మంతనాలు జరిపారట జగన్. కాకపోతే అందరూ ఫ్రీడమ్ కావాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. చివరకు ఐ ప్యాక్‌తో మంతనాలు జరిపినట్టు సమాచారం. కాకపోతే కొన్ని సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వాలని మెలిక పెట్టారట. సరేనని ఊ కొట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే కొందరు నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఐ ప్యాక్ తట్టా బుట్టా సర్దుకుని ప్యాక్ చేసిందనే టాక్ నడిచింది. వైసీపీ పునర్ నిర్మించేందుకు సాయిదత్‌ను నియమించారనే ప్రచారం సాగింది. కానీ, ఎందుకో గానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ చర్చలు జరుగుతున్న సమయంలో ఐ ప్యాక్ రీఎంట్రీ ఇచ్చేసింది.
ALSO READ: యూట్యూబ్ ఛానెల్ ముసుగులో వ్యభిచారం
ఒక్కసారి వెనక్కి వెళ్దాం. 2019లో వైసీపీ గెలవడం వెనుక, జగన్ పాదయాత్ర, ఐ ప్యాక్ రోల్, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు వర్కవుటయ్యాయి. ఈ క్రమంలో 151 సీట్లను గెలుచుకుంది. అనుకోని సమస్యల వల్ల ఐ ప్యాక్ కు పీకే దూరమయ్యారు. ఆ తర్వాత దాని పగ్గాలు రుషిరాజ్ సింగ్ చేపట్టినా ఫలితం రాలేదు. ఫలితంగా 151 సీట్ల నుంచి 11 పడిపోయింది. మూడు నెలల కిందట ఐ ప్యాక్‌ను సంప్రదించారట జగన్.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కేవలం ఐ ప్యాక్ మాత్రమే కాదు. ఆ పార్టీ చేసిన తప్పులు చాలానే ఉన్నాయట. అవన్నీ గమనించి మళ్లీ రీఎంట్రీ ఇచ్చేలా చేసిందని అంటున్నారు వైసీపీలోని ఓ వర్గం. ఇప్పుడు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి? ప్రజల దృష్టిని తమవైపు ఎలా మళ్లించుకోవాలి అనేదానిపై సలహాలు మాత్రమే ఇవ్వనుందని అంటున్నారు. ఈసారి సీనియర్లపై ఐప్యాక్ ప్రభావం ఏమాత్రం చూపదని అంటున్నారు. జగన్ చేసిన సూచనల మేరకు మిగతా నేతలు సైలెంట్ అయ్యారని అంటున్నారు.
ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు విషయానికొద్దాం. 2014-19 మధ్యకాలంలో టీడీపీ నేతలు అంత యాక్టివ్‌గా ఉండేవారు కాదు. దీంతో ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. కానీ ఇప్పుడు కూటమి సర్కార్, జగన్ మాట్లాడిన కొద్దిసేపట్లో గతంలో ఆయన మాట్లాడిన పాత వీడియోలను బయటపెడుతున్నారు. రీసెంట్‌గా జగన్ ప్రజల్లోకి వెళ్లిన రెండు అంశాల విషయానికొద్దాం.
జైలులో వంశీని పరామర్శించేందుకు వెళ్లిన తర్వాత పోలీసు అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. ఆయనపై పోలీసుల సంఘం అదేస్థాయిలో రియాక్ట్ అయ్యింది. ఇక గుంటూరు మిర్చియార్డ్ విషయంలో జగన్ కామెంట్స్‌పై మంత్రి అచ్చెన్న కౌంటరిచ్చారు. అప్పటి వైసీపీ సర్కార్ ఇచ్చిన ఎంఎస్‌పీ ఉత్తర్వులు బయటపెట్టారు. దీంతో ఆ పార్టీ నేతలంతా సైలంట్ అయిపోయారని గుర్తు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి సర్కార్‌ని ఎదుర్కోవడం ఆశామాషీగా కాదని కొందరు వైసీపీ నేతలు ఓపెన్‌గా చెప్పడం గమనార్హం.