BigTV English

Vijayawada Spa Center: యూట్యూబ్ ఛానల్ ముసుగులో వ్యభిచారం.. రైడ్‌లో పట్టుపడ్డ వైసీపీ నేత

Vijayawada Spa Center: యూట్యూబ్ ఛానల్ ముసుగులో వ్యభిచారం.. రైడ్‌లో పట్టుపడ్డ వైసీపీ నేత

Vijayawada Spa Center: విజయవాడలో స్పా సెంటర్ నిర్వహణ అంశం హాట్‌ టాపిక్‌గా అయ్యింది. హైటెక్‌ నిఘా, భారీ భద్రత మధ్య సాగుతున్న వ్యభిచారం గుట్టు రట్టైంది. బయట యూట్యూబ్ ఛానల్ పేరుతో బోర్డు పెట్టి.. స్పా సెంటర్ నడిపిస్తున్న నిర్వాహకులు అందులోనే గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్నారు. విజయవాడ వెటర్నరీ కాలనీలోని ఫీడర్‌ రోడ్డులో ఉన్న మూడంతస్తుల భవనంలో గురునానక్‌ కాలనీకి చెందిన చలసాని ప్రసన్న భార్గవ్‌ స్టూడియో 9 పేరుతో స్పా సెంటర్‌ నిర్వహిస్తున్నాడు.


సమాచారం తెలుసుకున్న పోలీసులు స్టూడియో 9 కార్యాలయంపై సిబ్బందితో రైడ్ చేసి.. అక్కడ 10 మంది మహిళలు, 13 మంది యువకులను అరెస్టు చేశారు. మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అయితే.. ప్రస్తుతం భార్గవ్‌.. పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న మాచవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే పోలీసుల రెయిడ్‌లో రాష్ట్ర గిరిజన కమిషన్‌ సభ్యుడిగా పనిచేస్తున్న వైసీపీ నేత శంకర్‌ నాయక్‌ దొరకడం పొలిటికల్ హీట్ రేపుతోంది. పోలీసుల దాడి చేయడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే అన్ని దారులు మూసుకుపోయాయి. ఏమీ చేయలేని స్థితిలో ఒక గదిలోని మంచం కింద శంకర్ నాయక్ దాక్కున్నాడు.


అప్పటికే రూంలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. ఓ అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. మంచం కింద శంకర్ నాయక్‌ను కూడా గమనించారు. దీంతో అతడిని పోలీసులు బయటికి లాక్కొచ్చారు. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శంకర్ నాయక్ వైసీపీ నేత, రాష్ట్ర గిరిజన కమిషన్‌ సభ్యుడు కావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది.

వీడియోలో చూస్తే.. గిరిజనులకు మేలు చేయాల్సిన కమిషన్ సభ్యుడి వికృతరూపం. పోలీసులు వచ్చారని తెలిసి ఖంగుతిన్న శంకర్‌నాయక్.. మంచం కింద దూరడం సిగ్గుచేటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచం కింద నుంచి బయటకొచ్చేందుకు, ఆ తర్వాత మొహం దాచుకునేందుకు నానాతంటాలు పడ్డాడు.

Also Read: అమకావతి ఓఆర్ఆర్ పై ప్రభుత్వం ఫోకస్.. భూసేకర కోసం అడుగులు

పోలీసులు తనిఖీలకు వస్తే ముందుగా గుర్తించడానికి స్పా సెంటర్‌కు వెళ్లే మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తలుపులను టెక్నాలజీకి అనుసంధానం చేసి, వేలిముద్రల స్కానింగ్‌ మిషన్లు ఏర్పాటు చేశారు. బయట ఎవరు న్నారో తెలుసుకోడానికి తలుపులకు చిన్నచిన్న అద్దాలతో కూడిన పరికరాలు అమర్చాడు. పోలీసులు వస్తే పక్కనే ఉన్న భవనం పైకి వెళ్లిపోవడానికి యువతులకు, సిబ్బందికి భార్గవ్‌ శిక్షణ ఇచ్చాడు. పోలీసుల సోదాలు చేయడంతో భార్గవ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. స్పా సెంటర్‌ మేనేజర్‌ దగ్గుబాటి శ్యాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం భార్గవ్ పరారీలో ఉన్నాడు. భార్గవ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Related News

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?

Big Stories

×