Sobhita Dhulipala: అక్కినేని నాగ చైతన్య- శోభితాల వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న విషయం తెల్సిందే. మరి కొద్దీ సేపటిలో చై.. శోభితా మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. అక్కినేని- ధూళిపాళ్ల బంధువుల మధ్య ఈ జంట భార్యాభర్తలు కానున్నారు. ఇక ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి వధువు శోభితా.. అచ్చ తెలుగు ఆడపడుచుగా కనిపిస్తూనే వస్తుంది. ఎక్కడా.. గ్లామర్ కు అవకాశం లేకుండా.. పెద్దలు ఏది చెప్తే అది చేసుకుంటూ వస్తుంది.
పసుపు దంచడం, హల్దీ, పెళ్లి కూతురును చేసే వేడుక .. ఇలా ప్రతి వేడుకల్లోనూ తన అందాన్ని మరింత పెంచే విధంగా వస్త్రాలను ధరిస్తుంది. ఇక పెళ్లిలో కూడా ఆమె అదే తెలుగుదనాన్ని చూపించింది. తాజాగా శోభితా పెళ్లి కూతురు ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అప్పుడే ఆమె చేతిలో కొబ్బరి బొండం పట్టుకొని.. మండపంలో కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
Nagababu: మెగా ఫ్యాన్స్ కు నాగబాబు విజ్ఞప్తి.. పుష్ప 2 ను ఆదరించండి
తెనాలి అమ్మాయి.. పెళ్లి కూతురు ముస్తాబులో ఎంతో అద్భుతంగా కనిపించింది. బంగారు వర్ణం కలబోసిన పట్టు చీర.. ఏడువారాల నగలను అలంకరించుకొని.. తల్లిదండ్రుల మధ్య కూర్చొని.. పూజ చేస్తూ కనిపించింది. ఇక చై సైతం పెళ్లి బట్టల్లో అదిరిపోయాడు. ఈ పెళ్ళికి టాలీవుడ్ నుంచి చాలా తక్కువమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరుకానున్నారు. రాజమౌళి, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు.. పెళ్ళికి రానున్నారని సమాచారం.
ఇక అక్కినేని నాగచైతన్య మొదట హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే. నాలుగేళ్ళ తరువాత వీరి మధ్య సమస్యలు తలెత్తడంతో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే ఆ సమయంలోనే శోభితాతో చై ప్రేమలో పడ్డాడు. గత రెండు ఏళ్లుగా చై- శోభితా డేటింగ్ లో ఉన్నారట. ఇరు కుటుంబాలను ఒప్పించి నేడు వీరు ఒక్కటి కానున్నారు. ఇక ఎప్పుడెప్పుడు వీరి పెళ్లి ఫోటోలు బయటకు వస్తాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.