BigTV English

Nagababu: మెగా ఫ్యాన్స్ కు నాగబాబు విజ్ఞప్తి.. పుష్ప 2 ను ఆదరించండి

Nagababu: మెగా ఫ్యాన్స్ కు నాగబాబు విజ్ఞప్తి.. పుష్ప 2 ను ఆదరించండి

Nagababu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ వేళా.. ఎక్కడచూసినా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశాంతంగా.. ఫ్యాన్స్ హంగామాతో రిలీజ్ కావల్సిన సినిమా ఇప్పుడు గొడవలు, దాడుల మధ్య విడుదల అవుతుంది.  అందుకు కారణం అల్లు అర్జున్ నంద్యాల  పర్యటనే.  పవన్ కళ్యాణ్ కు కాకుండా బన్నీ.. వైసీపీ నేతకు సపోర్ట్ గా నంద్యాల పర్యటనకు వెళ్లడంతో మెగా – అల్లు ఫ్యామీలీల మధ్య  వైరం ఎక్కువ అయ్యింది.


మెగాస్టార్, పవర్ స్టార్ దీని గురించి స్పందించలేదు కానీ, మెగా బ్రదర్ నాగబాబు..  తనదైన రీతిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. “మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే” అని రాసుకొచ్చాడు. అంటే డైరెక్ట్ గా అల్లు అర్జున్ మావాడు కాదు అని చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ అప్పట్లో పెను సంచాలనాన్ని సృష్టించింది. అయితే ఆ తరువాత ఏమైందో ఏమో కానీ..  ఆ ట్వీట్ ను నాగబాబు డిలీట్ చేశాడు.

Kollywood 2024: బాక్సాఫీస్ కింగ్ ఎవరో తెలుసా..?


ఇక ఎప్పుడు సమయం దొరికినా కూడా నాగబాబు.. ఈ విషయం గురించి ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేస్తూనే వస్తున్నాడు. ఈ ఇన్సిడెంట్ వలన మెగా – అల్లు ఫ్యాన్స్ విడిపోయారు. పుష్ప 2 రిలీజ్ అవ్వాలంటే.. అల్లు అర్జున్, చిరంజీవికి క్షమాపణ చెప్పాలని కొందరు, సినిమా రిలీజ్ రోజున దాడులు చేస్తామని కొందరు సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ వస్తున్నారు. అయితే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మేము మేము బాగానే  ఉంటాం అని మహేష్ బాబు చెప్పినట్లు.. ఇప్పుడు మెగా – అల్లు కుటుంబాలు కలిసిపోయాయి. పుష్ప 2 కు మెగా హీరోలు సపోర్ట్ ఇస్తున్నారు.

ఇప్పటికే మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్.. పుష్ప 2 కు బెస్ట్ విషెస్ తెలిపాడు. ఇక తాజాగా నాగబాబు సైతం.. పుష్ప 2 సినిమాను మెగా అభిమానులు ఆదరించాలని కోరాడు. సినిమా పేరు మెన్షన్ చేయకుండా.. ” 24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల‌ మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే *సినిమా* ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం… అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Allu Arjun: పుష్పకు తేజ్ విషెస్.. అల్లు అర్జున్ అలా అనేశాడేంటి.. ?

కొన్ని రోజులుగా నాగబాబు ఏ పోస్ట్ పెట్టినా బన్నీ ఫ్యాన్స్  ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చినా.. బన్నీని ఏం చేయలేరని, చిరు ఎక్కడ నుంచి వచ్చాడు.. అల్లు రామలింగయ్య వలన కాదా.. అసలు మెగాస్టార్ వచ్చిందే.. అల్లు అర్జున్ తాత వలన.. అది మర్చిపోయి మాట్లాడకూడదని కొందరు.. మెగా కుటుంబం మొత్తం ఒకవైపు.. బన్నీ ఒక్కడే ఒక వైపు.. రేపు పుష్ప  2 హిట్ తో అది అందరికీ తెలుస్తోంది అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి రేపు బన్నీ ఎలాంటి రికార్డులు తిరగరాస్తాడో చూడాలి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×