IT Raids at Sukumar : గత నాలుగు రోజులు నుంచి తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఐటీ రైడ్స్ ముగిశాయి. నిన్న (గురు వారం) రాత్రే దాదాపు అందరి ఇంట్లో సోదాలను ముగించారు. కానీ, దిల్ రాజు కార్యాలయం SVC లో ఈ రోజు ఉదయం కూడా రైడ్స్ కొనసాగించారు. తాజాగా అక్కడ కూడా సోదాలు ముగిశాయి. అయితే ఈ సోదాల్లో అధికారులకు ఏం దొరికాయి అనేది ప్రశ్నగా ఉంది. అయితే, ఇండస్ట్రీలో వినిపిస్తున్నా దాని ప్రకారం… డైరెక్టర్ సుకుమార్‌కు భారీ ఝలక్ ఇచ్చినట్టు సమాచారం. అది ఏంటో ఇప్పుడు చూద్ధాం…
ఐటీ సోదాలు ఎందుకు జరిగాయో దాదాపు అందరికీ తెలిసిందే. చెల్లించే ఐటీ, జీఎస్టీకి సంబంధం లేకుండా కలెక్షన్ల పోస్టర్లు రావడంతోనే ఈ ఐటీ రైడ్స్ జరిగాయి అని అంటున్నారు. ఏది ఏమైనా… దాదాపు నాలుగు రోజుల పాటు ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలా… పుష్ప 2 మూవీ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ దాడులు నిర్వహించింది.
దీనికి కారణం… పుష్ప 2 మూవీలో సుకుమార్‌కు కూడా షేర్ ఉందట. రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో షేర్ వెళ్లడంతో ఐటీ అధికారులు… సుక్కుపై ఫోకస్ చేశారని సమాచారం. సుక్కుపై ఐటీ అధికారులు చేసిన దాడిలో ఏం దొరికాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న కధనాల ప్రకారం… ఐటీ దాడుల్లో సుక్కు ఇంట్లో ఐటీ లెక్కల్లోకి రాని, జీఎస్టీ లెక్కలు లేని కొంత డబ్బు దొరికిందట. అంతే కాదు… కొన్ని విలువైన డాక్యుమెంట్స్ ఐటీ అధికారుల కంట పడ్డాయని సమాచారం. దీంతో లెక్కాల మాస్టర్ దగ్గర లెక్కకు రాని డబ్బులను, పలు కీలకమైన డాక్యుమెంట్స్‌నున ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారట.
దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలీదు. కానీ, ఒక వేళ నిజంగానే సుకుమార్ దగ్గర డబ్బు, డాక్యుమెంట్స్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుంటే మాత్రం… ఈడీ కార్యాలయానికి సుక్కు వెళ్లడం ఖాయం అని చెప్పొచ్చు.
కాగా, దిల్ రాజు ఇంట్లో కూడా ఐటీ సోదాలు సీరియస్ గా జరిగాయని తెలుస్తుంది. అందరి ప్రముఖుల నివాసల్లో గురు వారం రాత్రే సోదాలు నిలిపివేశారు. కానీ, దిల్ రాజు ఇంట్లో శుక్రవారం ఉదయం వరకు సోదాలు నిర్వహించారు. అలాగే దిల్ రాజు కార్యాయం అయిన SVC లో కూడా మధ్యాహ్నం వరకు ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో దిల్ రాజు నుంచి పలు కీలక డాక్యమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.