Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్స్‌కు ఇంకా ఒక్క వారమే ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ఆరుగురు మాత్రమే వచ్చే వారం జరగనున్న ఫైనల్స్ వరకు వెళ్తారు. ఇప్పటికే అవినాష్.. టికెట్ టు ఫినాలేను గెలుచుకొని మొదటి ఫైనలిస్ట్ అయ్యి ఫైనల్స్‌లో తన స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇప్పుడు మిగతా ఆరుగురు ఫైనల్స్‌కు వెళ్లడం కోసం పోటీపడాలి. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇందులో ఫైనల్స్‌క వెళ్లకూడదు అనుకుంటున్న కంటెస్టెంట్ ఎవరు అని అందరినీ అడిగారు బిగ్ బాస్. ఆ క్రమంలో నిఖిల్, గౌతమ్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. చాలాకాలం తర్వాత నిఖిల్‌లోని ఫైర్ బయటికొచ్చింది.
అవినాష్ చేతిలో పవర్
‘‘సేఫ్ జోన్‌లో ఇంటి సభ్యులు అందరి ముఖాలతో సేఫ్ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరి ఫ్రేమ్స్‌ను కాల్చి ఈ రేసు నుండి వారిని తొలగించాల్సి ఉంటుంది’’ అంటూ బిగ్ బాస్ వివరించడంతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. ఇప్పటికే అవినాష్.. ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ముందుగా ఫ్రేమ్‌ను కాల్చే అవకాశం తనకు దక్కింది. తను విష్ణుప్రియా ఫైనల్స్‌లో ఉండకూడదు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘‘ముందు నుండే నాకు ఈ షో సెట్ అవ్వదు అని చెప్తున్నావు. గేమ్ అంటే టాస్కులు ఒక్కటే కాదు. పర్సనాలిటీ కూడా అని నువ్వే అన్నావు. గేమ్స్ ఆడుతున్నాం కానీ అది ఎలా ఆడుతున్నామనేది కూడా ముఖ్యమే’’ అని కారణం చెప్పాడు. దానికి విష్ణుప్రియా ఒప్పుకోలేదు.
Also Read: నామినేషన్స్ వేళ కంటెస్టెంట్స్ కి భారీ షాక్.. ఆఖరి వారం నామినేషన్స్ లిస్ట్ వైరల్..!
గౌతమ్ తప్పు
అవినాష్ వల్ల విష్ణుప్రియా సేఫ్ జోన్ నుండి తప్పుకుంది కాబట్టి తర్వాత ఒక కంటెస్టెంట్‌ను తప్పించే అవకాశం తనకు లభించింది. దీంతో తను గౌతమ్ పేరు చెప్పింది. ‘‘నేనేంటో, నా ఇంటరాక్షన్ ఏంటో నీకు అర్థం కాలేదు. అది నా తప్పు కాదు’’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు గౌతమ్. వీకెండ్స్‌లో నాగార్జున మాట్లాడుతున్నప్పుడు గౌతమ్ జోక్యం చేసుకోవడాన్ని గుర్తుచేసింది విష్ణుప్రియా. ‘‘ఆయనకు నేను వివరించడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడు నేను చేసింది తప్పు. అక్కడే నాకు శిక్ష పడింది’’ అని ఒప్పుకున్నాడు గౌతమ్. మొత్తానికి విష్ణుప్రియా, గౌతమ్ సేఫ్ జోన్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత గౌతమ్‌కు అవకాశం రావడంతో తను నిఖిల్ పేరు చెప్పాడు.
యష్మీని వాడుకున్నావు
గౌతమ్ తన పేరు చెప్పడంతో నిఖిల్‌కు కోపం వచ్చింది. ‘‘పృథ్వి, నేను లేదా ఇంకెవరైనా ఎవరితో అయినా అమర్యాదగా మాట్లాడితే తప్పు. కానీ అది నువ్వు చేస్తే ఒప్పు’’ అని అరిచాడు. ‘‘నేనెప్పుడు చెప్పాను ఒప్పు అని’’ అంటూ రివర్స్ అయ్యాడు. ‘‘నువ్వు అలాగే ప్రవర్తిస్తావు’’ అని సీరియస్ అయ్యాడు నిఖిల్. ‘‘ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు ఇన్నిరోజులు ఎందుకు మాట్లాడలేకపోయావు. ఏది నిజం?’’ అని అడిగాడు గౌతమ్. రెండు నిజమే అని సమాధానమిచ్చాడు నిఖిల్. ‘‘నా ఆట నేను ఆడతాను. నా నుండి నువ్వు ఏదీ ఆశించొద్దు. యష్మీని వాడుకుంది నువ్వు’’ అంటూ ఆరోపించాడు గౌతమ్. ‘‘నీ నుండి వినడానికి రాలేదు. ఇంకొకసారి నోరుజారితే వేరేలాగా ఉంటుంది’’ అంటూ గౌతమ్‌కు వార్నింగ్ ఇచ్చాడు నిఖిల్.