Pushpa 2 Advance Booking : ఇప్పుడు దేశవ్యాప్తంగా “పుష్ప 2 : ది రూల్” ఫీవర్ నడుస్తోంది. టాలీవుడ్ లో మెగా – అల్లు వివాదం వల్ల ఈ సినిమాపై తీవ్రంగా నెగెటివిటీ నడుస్తున్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా తగ్గేదే లే అంటూ దూసుకెళ్తోంది ‘పుష్ప 2’ (Pushpa 2). నవంబర్ 30న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యింది. ప్రారంభించిన 48 గంటల్లోనే భారతదేశంలో ‘పుష్ప 2’ డే 1 ప్రీ-సేల్స్ రూ. 31.91 కోట్లను దాటింది.
“పుష్ప 2 : ది రూల్” మోస్ట్ అవైటెడ్ మూవీ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజా సమాచారం ప్రకారం, సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ దుమ్మురేపుతోంది. అన్ని భాషలు, ఫార్మాట్లలో కలిపి ఇప్పటిదాకా ఈ సినిమాకు 6.82 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇందులో 2D, 3D, IMAX, 4DX వెర్షన్‌లు కూడా ఉన్నాయి. కేవలం బుకింగ్స్ ఓపెన్ అయిన రెండు రోజుల్లోనే, మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూ.31.91 కోట్లు వసూలు చేయడం చూస్తుంటే, దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈ మూవీ కోసం ఎంత ఆకలిగా ఉన్నారో అర్థం అవుతోంది.
‘పుష్ప 2’ (Pushpa 2) అడ్వాన్స్ టికెట్ బుకింగ్ లో తెలుగు, హిందీ వెర్షన్లు స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే బుకింగ్స్ పరంగా 2,77,542 టిక్కెట్లు అమ్ముడైన తెలుగు వెర్షన్ రూ. 10.28 కోట్లు రాబట్టింది. రూ.6.76 కోట్ల టిక్కెట్ అమ్మకాలతో తెలంగాణ ముందంజలో ఉండగా, బ్లాక్ చేసిన సీట్లతో కలిపి రూ.9.38 కోట్లకు చేరుకుంది. అలాగే హిందీ వెర్షన్ కు 2,66,083 టిక్కెట్లు కాగా, రూ. 7.6 కోట్లు వసూలు చేసింది. ఇక అల్లు అర్జున్ కు మంచి అభిమానగణం ఉన్న మలయాళ వెర్షన్ 2డి స్క్రీనింగ్ లలో టికెట్ బుకింగ్ ద్వారా రూ. 46.69 లక్షలు కొల్లగొట్టింది ‘పుష్ప 2’ (Pushpa 2). అలాగే ఇతర వెర్షన్ ల టికెట్ బుకింగ్ కూడా ఊపందుకుంటున్నాయి. సౌత్ లో ‘పుష్ప 2’ టికెట్ బుకింగ్ పరంగా టాలీవుడ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, కర్ణాటక రూ. 3.15 కోట్లతో (బ్లాక్డ్ సీట్లతో రూ. 4.79 కోట్లు), మహారాష్ట్ర రూ. 2.64 కోట్లతో (బ్లాక్డ్ సీట్లతో కలిపి రూ. 3.57 కోట్లు) మూడో స్థానంలో నిలిచింది.
ఇప్పటివరకు ‘పుష్ప 2’కు సంబంధించి ఇండియాలో 16,006 షోలకుగానూ 6.59 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. టిక్కెట్ల అమ్మకాలలో రూ. 21.49 కోట్లు ఇలా రిలీజ్ కు ముందుగానే వచ్చేశాయి. బ్లాక్ చేసిన సీట్లతో కలిపి మొత్తం అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు రూ.31.91 కోట్లకు చేరుకున్నాయి. అయితే తమిళంలో మాత్రం తుఫాన్ కారణంగా బుకింగ్ జోరు పెద్దగా కన్పించట్లేదు. ఇక ‘పుష్ప 2’ (Pushpa 2) అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఓవర్సీస్‌లో 70 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టినట్లు అంచనా. ఈ జోరు చూస్తుంటే పుష్పరాజ్ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు రూ. 303 కోట్లు, అందులోనూ ఇండియాలోనే రూ. 233 కోట్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు.