E-Paper
Advertisement

Sobitha Dhulipala: అక్కినేని కోడలు.. ఐరెన్ లెగ్.. ?

Sobitha Dhulipala: అక్కినేని కోడలు.. ఐరెన్ లెగ్.. ?
Advertisement

Sobitha Dhulipala:బిడ్డొచ్చిన వేళ.. గొడ్డొచ్చిన వేళ అనే సామెత తెలుగులో బాగా ఫేమస్. ముఖ్యంగా తెలుగు కుటుంబాల్లో  ఇలాంటివి బాగా నమ్ముతారు. ఇంట్లో శుభకార్యం జరిగాకా.. ఏదైనా అనుకోని ఘటన జరిగితే.. దానికి కారణం ఇంట్లో అడుగుపెట్టిన వారే అని గుసగుసలు ఆడుకోవడం వింటూనే ఉంటాం. ఇప్పుడు అక్కినేని కోడలు గురించి కూడా అలాగే మాట్లాడుకుంటున్నారు నెటిజన్స్. అక్కినేని నాగచైతన్య.. ఈ మధ్యనే శోభితా ధూళిపాళ్లతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెల్సిందే.

చై- సామ్ విడిపోయాక నాలుగేళ్లు ఒంటరిగా ఉన్న చై.. గత మూడేళ్ళుగా  శోభితాతో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వినిపించాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ ఈ మధ్యనే చై- శోభితా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇక ఎంగేజ్ మెంట్ అయ్యి నెల కూడా కాకముందే అక్కినేని ఇంట ఒక అనుకోని సంఘటన జరిగింది.

Advertisement

అక్కినేని ఆస్తుల్లో ముఖ్యమైన N కన్వెన్షన్ ను ప్రభుత్వం కూల్చివేసింది. దీనివలన  నాగ్ కు చాలా నష్టం వాటిల్లింది. దీంతో నాగ్ ఇంట అడుగుపెట్టిన శోభితా వలనే ఇదంతా జరిగిందని .. ఆమె ఐరెన్ లెగ్ అని ముద్రవేస్తున్నారు.  ఇప్పటివరకు కూల్చివేయని ప్రభుత్వం.. ఇప్పుడు కూల్చివెయ్యడంతో  ఆమె వచ్చిన వేళ బాగాలేదని చెప్పుకొస్తున్నారు.

శోభితా ఐరెన్ లెగ్..  అక్కినేని కుటుంబంలో అడుగుపెడితే.. ముందు ముందు చాలా నష్టం వాటిల్లుతుందని కామెంట్స్  చేస్తున్నారు.  కోడలు ఇంట్లో అడుగుపెట్టింది.. అక్కినేని కుటుంబం రోడ్డున పడింది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.నిజం చెప్పాలంటే.. దీనికి, శోభితాకు అస్సలు సంబంధం లేదు.

Advertisement

ఎప్పటి నుంచో నాగ్ అక్రమ ఆస్తుల గొడవ నడుస్తుంది. అనుకోకుండా ఇది ఇప్పుడు  జరిగింది కానీ, దీనికి, శోభితాకు లింక్ పెట్టడం సరికాదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఒక అమ్మాయిని పెళ్ళికి ముందే ఇలాంటి మాటలు అనడం సరికాదని, దానివలన ఆమె మనసు ఎంత బాధపడుతుందో అర్ధం చేసుకోవాలని చెప్పుకొస్తున్నారు.    త్వరలోనే చై – శోభితా పెళ్లి జరగనుంది.  మరి ఈ విషయమై కొత్త జంట  ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×