BigTV English

Minister Ponnam: రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి.. వెంటనే చర్యలు తీసుకుంటాం: మంత్రి పొన్నం

Minister Ponnam: రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి.. వెంటనే చర్యలు తీసుకుంటాం: మంత్రి పొన్నం

Minister Ponnam Comments: రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువుల కబ్జా విషయమై ఆయన మాట్లాడుతూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో మంత్రి మాట్లాడుతూ.. “రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఎంత పెద్ద వాళ్లు ఉన్నా చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం ఇది. మీ ప్రాంతంలో ఎక్కడ ఆర్టీఏ ద్వారా తీసుకున్న పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన వారసత్వపు చెరువులు ఎక్కడెక్కడ ఉన్నయో చెరువులు ఆక్రమణకు గురైతే.. ఆక్రమ చేసినవారు ఎంత పెద్ద వారైనా.. ఏ పార్టీ వారైనా సరే.. సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి. వారిపై చర్యలు తీసుకుంటాం.


Also Read: నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు కేటీఆర్: మధుయాష్కీ

ముఖ్యంగా హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమంలో జంట నగరాల్లో హైదరాబాద్, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరానికి చెరువులను కాపాడుకోవడానికి ఈ ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలోని చెరువులను రక్షించుకోవడానికి ముందుకు రావాలి. ఇది ఎవరి మీద కక్ష పూరితంగా , వ్యక్తిగతంగా ఉద్దేశ్య పూర్వకంగా, వ్యక్తుల మీద, పార్టీల మీద జరుగుతున్న పోరాటం కాదు. ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్న చర్య. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో తీసుకున్న చర్య. ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురయ్యాయో అక్కడ సమాచారం ఇవ్వాలి” అంటూ మంత్రి ఆ వీడియో పేర్కొన్నారు.


Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×