Sree Vishnu Single Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్‌లో శ్రీ విష్ణు ఒకడు. వెబ్ డిజైనర్ గా కెరియర్ మొదలు పెట్టిన శ్రీ విష్ణు బాణం సినిమాతో నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో లీడ్ రోల్ లో కనిపించాడు. ఆ తరువాత మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం కార్తీక్ రాజు దర్శకత్వంలో సింగిల్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 9న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గాని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ట్రైలర్ కాంట్రవర్సీ
తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలానే ఈ ట్రైలర్ వలన కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా కన్నప్ప సినిమాలోని శివయ్య అనే డైలాగును వాడినందుకు తీవ్రమైన ఆరోపణలు కూడా వచ్చాయి. అంతేకాకుండా మంచు కురిసిపోవడం అనే డైలాగ్ వలన కొంతమంది మనోభావాలు కూడా దెబ్బతిన్నట్లు వార్తలు వినిపించాయి. దీనితో శ్రీ విష్ణు ఒక వీడియోని చేసి ఎవరిని తక్కువ చేయడానికి మేము ఇలా చేయలేదు. కేవలం అటువంటి డైలాగ్ మాత్రమే కాకుండా దిల్ రాజు, అల్లు అరవింద్, బాలకృష్ణ లాంటి వారిని కూడా మేము ఇమిటేట్ చేసాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ లాంటిది. అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను అని క్లారిటీ కూడా ఇచ్చాడు.
ఎందుకు సారీ చెప్పావు అన్న
ఇది శ్రీ విష్ణు విషయానికొస్తే తనకి కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మంచు విష్ణుని ఉద్దేశించి ఎందుకు సారీ చెప్పావు. మంచు విష్ణు నీ సినిమా అసలు వన్ పర్సెంట్ కూడా చూడరు. మీ సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఏదో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కన్నప్ప సినిమా చూడడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. శ్రీ విష్ణు కి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. యూత్ ఆయన సినిమాలు చూస్తారు. అని చెప్తూ కొంతమంది శ్రీ విష్ణును మెన్షన్ చేస్తూ నువ్వు సారీ చెప్పడం ఏంటి బ్రో అంటూ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు.