Prabhas: టాలీవుడ్ లో విలన్ పాత్రలో మెప్పిస్తున్న కన్నడ నటుడు వశిష్ట. కన్నడ సినీ ఇండస్ట్రీలో రాజాహులి చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమయ్యారు. వశిష్ఠ వరుసగా కన్నడలో సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. తెలుగులో వెంకటేష్ నారప్ప సినిమాతో పరిచయం అయ్యారు. సినిమాలే కాక గాయకుడిగా ఎన్నో పాటలను అందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆ వివరాలు చూద్దాం..
ఆ సినిమాలో హీరో కి డబ్బింగ్ …
ఇటీవల విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో తిరుపతి క్యారెక్టర్ తో వశిష్ట మన ముందుకు వచ్చారు. ఆ సినిమాలో ఆయన ఎంతో భయపెట్టాడు. ఈ చిత్రంలో ఆ పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. తమన్నాతో లాస్ట్ క్లైమాక్స్ లో ప్రేక్షకులను భయపెట్టాడు. తిరుపతి పాత్ర కోసం ఆయన గొంతుని మార్చి మాట్లాడడం, నటుడిగా ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వశిష్ట మాట్లాడుతూ .. టాలీవుడ్ లో స్టార్ హీరో కి డబ్బింగ్ చెప్పిన విషయాన్ని బయట పెట్టాడు. ‘నాకు నా వాయిస్ దేవుడిచ్చిన వరం. ఈ విషయంలో నేను లక్కీ అని అనుకుంటాను. ఎవరికి తెలియని విషయం ఏంటంటే.. నేను కన్నడ సలార్ సినిమాకు ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పాను’ అని ఆయన తెలిపారు. ఈ వీడియో చూసిన వారంతా తిరుపతిగా భయపెట్టిన వశిష్ట బేస్ వాయిస్ తో సలార్ లో ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పడం చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
భయపెట్టే విలన్ గానే కాదు సింగర్ గాను గుర్తింపు ..
వశిష్ట విలన్ పాత్రలో ఓదేల రైల్వే స్టేషన్లో అద్భుతమైన నటన కనపరిచారు. తెలుగు, కన్నడలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. నారప్ప మొదలుకొని కే జి ఎఫ్ చాప్టర్ 2, ఓదెల రైల్వే స్టేషన్, సింబా, ఓదెల రైల్వే స్టేషన్ 2 వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. కే జి ఎఫ్ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కే జి ఎఫ్ చాప్టర్1, 2 ల లో కమల్ పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. సీక్వెల్ లోను మొదటి భాగం కొనసాగింపుగా క్యారెక్టర్ ని మలిచారు డైరెక్టర్. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే, గాయకుడిగా ఎన్నో తెలుగు సినిమాలలో పాటలు పాడారు. 2016 లో వచ్చిన కిర్రాక్ పార్టీ సినిమా నుండి రామార్జునుడు సినిమా వరకు ఎన్నో సినిమాలలో పాటలను పాడి అలరించారు. ఆయన బహుముఖ నటనతో మరెన్నో చిత్రాలతో మన ముందుకు రావాలని కోరుకుందాం.
Mahesh Babu : ప్రియాంక – మహేష్ పాట.. ప్యాకప్ తో నెలరోజులు రెస్ట్ అంటున్న మహేష్..