Manchu Manoj : తెలుగు సెలబ్రిటీస్ గురించి కొన్ని వార్తలు ఎంత దాచినా కూడా దాగవు. సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ప్రతి వారు ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక హీరో హీరోయిన్ కలిసి తిరిగితే వారిద్దరి మధ్య ఏదో ఉంది అని క్షణాల్లో వార్తలు వినిపిస్తాయి. ఆ ఇద్దరి మనుషులకి లేని క్లారిటీ కూడా కొన్నిసార్లు మీడియా ఇచ్చేస్తుంది. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్ ఎన్నో వచ్చాయి. ఒక యంగ్ హీరో మంచు మనోజ్ భూమ మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోవడానికి అంటే ముందు నుంచే వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మనోజ్ తన భార్యతో పాటు వేరుగా ఉండేవాళ్ళు. తర్వాత మౌనిక ప్రెగ్నెంట్ అయిన తర్వాత మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ కు పిలుపు వచ్చింది.
కలిసి ఉండడం నచ్చలేదు
మంచు మనోజ్ కు మోహన్ బాబు నుంచి పిలుపు రాగానే తన భార్య మౌనికతో పాటు మోహన్ బాబు ఇంటికి వెళ్లిపోయారు. అయితే అక్కడ మోహన్ బాబుతో కలిసి ఉండటం తన ఫ్యామిలీలోనే కొంతమందికి నచ్చలేదు అని చెప్పుకొచ్చాడు మనోజ్. మనోజ్ పేరు చెప్పకపోయినా కూడా అది విష్ణు అని చాలామందికి ఒక అవగాహన కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే వీరిద్దరూ పరస్పరంగా విమర్శలు చేసుకున్నారు. అయితే కాలేజ్ యాజమాన్యానికి సంబంధించి ఏవో ఫిర్యాదులను మోహన్ బాబుకి తెలపడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ల మధ్య వారధిగా నిలబడ్డాడు మనోజ్. అలా నిలబడటం వలన అది తగాదాలకు దారితీసింది అని మనోజ్ తన వెర్షన్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
అలా చేయడం వలనే తనపైనే కంప్లైంట్స్
ఇక మనోజ్ ఆ విషయాలు అన్నిటినీ మోహన్ బాబు దృష్టికి తీసుకువెళ్లడంతో కళాశాల యాజమాన్యం సిబ్బంది అంతా కూడా తనపైన కేసులు పెట్టారని తెలిపాడు. అంతేకాకుండా తనపైన కేసులు పెడితే లొంగనని తెలిసి తన భార్యను కూడా దానిలో ఇరికించారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇది మనోజ్ ఇచ్చిన వెర్షన్. ఇక మంచి ఫ్యామిలీ వివాదం ఏ స్థాయికి చేరిపోయిందో మీడియాలో అందరూ గమనించారు. ఇప్పటికీ ఈ వివాదం జరుగుతూనే ఉంది. రీసెంట్ గా భైరవం ఆడియో లాంచ్ లో కూడా శివయ్య అని పిలిస్తే శివుడు రాడు అని మనోజ్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర పరిణామాలకు దారితీసాయి. అయితే ఈ వివాదాలు సద్దుమనుకుతాయో లేదంటే ఇలానే సాగుతాయో తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.
Also Read : Trivikram – Venkatesh: పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు, పరిశీలనలో అద్భుతమైన టైటిల్స్