BRS Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కలకలం రేపుతున్న పేరు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కొద్ది రోజులుగా అమెరికాలో ఉంటూ కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరైన ఆమె, ఇప్పుడు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాగా, అక్కడ ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. జై కవితక్క పేరుతో ఎయిర్ పోర్ట్ మార్మోగింది.
కవిత ఇటీవల తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ లేఖలో పేర్కొన్న అంశాలపై సోషల్ మీడియా నుంచి, రాజకీయం వరకూ విస్తారంగా చర్చ జరుగుతోంది. ఆమె లేఖను కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించడం, అది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత తడబడలేనా అన్న అనుమానాలకు తావిస్తుంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తెలంగాణలో అడుగుపెట్టగా, ఆమె ఎలా స్పందిస్తారు? పార్టీపై, లేఖపై ఆమె మాటలెంటి? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడనున్నారని సమాచారం. ఈ విషయంపై ఆమె నేరుగా స్పందించబోతున్న నేపథ్యంలో, మీడియా, రాజకీయ పరిశీలకులు అక్కడికి భారీగా తరలివచ్చారు.
ఇక, కవితకు స్వాగతం పలికేందుకు ‘జాగృతి’ శ్రేణులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సామాజిక తెలంగాణ కోసం కవితక్క ముందుండాలి, కవితకు స్వాగతం.. మహిళా గొంతుకకు మద్దతు” అనే నినాదాలతో విమానాశ్రయం మార్మోగిపోతోంది. ‘టీం కవితక్క’ పేరిట ప్రత్యేక ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి ఆమెకు ఘన స్వాగతం పలికారు.
Also Read: Covid 19 in Telangana: తెలంగాణలో తొలి కోవిడ్ కేసు నమోదు.. ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోనే!
పార్టీలో మారుతున్న సమీకరణలు, రాష్ట్ర రాజకీయ దిశ మార్పులు, కుటుంబవ్యవహారాల్లో పలు అభిప్రాయభేదాలు, ఈ అన్నింటినీ ఈ రాకపై ఆధారపెట్టి చూడవచ్చు. కవిత ఈ ఉత్కంఠలపై స్పష్టతనివ్వనున్నారా? లేక మౌనమే ఆయుధంగా ఎంచుకుంటారో చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారబోతున్న ఈ క్షణం శంషాబాద్ విమానాశ్రయంలో మళ్లీ తెరలేపే రాజకీయ యుద్ధానికి శ్రీకారం కావొచ్చు. అయితే కవిత మాత్రం ఎయిర్ పోర్ట్ లో పిడికిలి బిగించి కార్యకర్తలకు, నాయకులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.