BigTV English

Trivikram – Venkatesh: పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు, పరిశీలనలో అద్భుతమైన టైటిల్స్

Trivikram – Venkatesh: పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు, పరిశీలనలో అద్భుతమైన టైటిల్స్

Trivikram – Venkatesh: స్వయంవరం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రచయితగా ఎంట్రీ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రముఖ రచయిత పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేశాడు త్రివిక్రమ్. తాను రచయితగా పనిచేసిన మొదటి సినిమా స్వయంవరం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. చాలామంది స్వయంవరం సినిమా హిట్ అవ్వగానే అడ్వాన్సులతో త్రివిక్రమ్ వద్దకు చేరారు. ఆ తర్వాత రచయితిగా త్రివిక్రమ్ సంపాదించిన పేరు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇప్పటికీ డైలాగ్ రైటర్ల ప్రస్తావన వస్తే మొదటి వినిపించే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. దర్శకుడు కంటే కూడా రచయిత గానే త్రివిక్రమ్ కి ఎక్కువ మార్కులు వేస్తారు కొంతమంది ప్రేక్షకులు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి పని చేసిన పెద్ద హీరో అంటే విక్టరీ వెంకటేష్.


బోరు కొట్టని నువ్వు నాకు నచ్చావ్

త్రివిక్రమ్ కెరియర్లో బెస్ట్ రైటింగ్ సినిమాల ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు నువ్వు నాకు నచ్చావ్. అనకాపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరిన వెంకటేశ్వర్లు కథ ఎప్పటికీ బోర్ కొట్టదు. ఈ సినిమాలోని ప్రతి డైలాగ్ ఆణిముత్యంలా ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ ను త్రివిక్రమ్ డిజైన్ చేసిన విధానం ఖచ్చితంగా మనసుకు హత్తుకుంటుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టను సినిమాలలో నువ్వు నచ్చావ్ సినిమా కూడా ఒకటి ఉంటుంది. అయితే రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్ తో పనిచేశారు గాని దర్శకుడుగా ఇప్పటివరకు వెంకటేష్ పని చేయలేదు. గతంలో వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తారు అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


అద్భుతమైన టైటిల్ 

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమాను చేయబోతున్నట్లు రీసెంట్ టైమ్స్ లో గట్టిగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తుంది. అలానే ఈ సినిమాకు ఆనందరావు లేదా కుటుంబరావు అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నారు. వాస్తవానికి ఈ టైటిల్స్ వింటుంటేనే ఒక రకమైన పాజిటివ్ వైబ్ వస్తుంది. ఈ  సినిమాను హారిక హాసిని బ్యానర్ పైన సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ సరసన రుక్మిణి వసంత ఈ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రాలేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. రచయితగా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల తర్వాత త్రివిక్రమ్ దర్శకుడుగా వెంకటేష్ తో చేస్తున్న మొదటి సినిమా ఇది.

Also Read : Mass Jathara : మాస్ జాతర ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్, రవితేజ నెక్స్ట్ షూటింగ్ లో పాల్గొనేది అప్పుడే

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×