Sonakshi Sinha..టాలీవుడ్.. ఒకప్పుడు ఈ పరిశ్రమను బాలీవుడ్ సినీ పరిశ్రమ చాలా చిన్నచూపు చూసింది. ముఖ్యంగా తెలుగు వాళ్ళు అంటేనే.. అసలు సినిమాలలో అవకాశాలు ఇవ్వడం కాదు కదా కనీసం చిన్న జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా ఇచ్చేవారు కాదు. అలాంటి టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్ స్టార్ట్స్ కాదు హాలీవుడ్ స్టార్స్ కూడా టాలీవుడ్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఒకప్పుడు చిన్నచూపు చూసిన బాలీవుడ్ తారలంతా కూడా ఇప్పుడు టాలీవుడ్ వైపు అడుగులు వేస్తుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ .. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలో నటిస్తే ఇప్పుడు పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోవచ్చని చాలామంది బాలీవుడ్ భామలు టాలీవుడ్ కి క్యూ కడుతున్నారు. అందులో భాగంగానే సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) కూడా ఇప్పుడు టాలీవుడే దిక్కంటూ ఇక్కడికి వచ్చేస్తోంది.
సుధీర్ బాబు సినిమాలో సోనాక్షి సిన్హా..
ఈమధ్య కాలంలో తన తోటి నటులంతా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తుంటే.. తాను ఎందుకు ట్రై చేయకూడదు అని ఫిక్స్ అయింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ట్రయిల్స్ వర్కౌట్ అయినట్లు కనిపిస్తున్నాయి. సుధీర్ బాబు త్వరలో చేస్తున్న ‘జటాధరా’ సినిమాలో సోనాక్షి కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు వెంకట్ కళ్యాణ్ (Venkat Kalyan) ఈమెను అప్రోచ్ అయి.. కథ వినిపించగా.. ఆమె కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మార్చి 8వ తేదీ నుండి జటాధర సినిమా సెట్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇకపోతే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక సుధీర్ బాబు విషయానికి వస్తే.. ఇప్పటికే తన సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ‘వర్షం’ రీమేక్ ‘భాఘీ’ లో విలన్ పాత్ర పోషించారు. ‘హరోం హరా’ సినిమాతో ఓకే అనిపించుకున్న ఈయన.. నెక్స్ట్ సినిమాను చాలా భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే డైరెక్టర్ సోనాక్షిని అప్రోచ్ అవ్వగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మొత్తానికైతే సుదీర్ బాబు సినిమాకు అదనపు ఆకర్షణ తీసుకురావడానికి డైరెక్టర్ ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే బాలీవుడ్ బ్యూటీ కూడా ఇప్పుడు తెలుగు చిత్రాలలోకి అడుగుపెట్టేసింది అని చెప్పవచ్చు.
ALSO READ Nayanthara: ఆ సినిమా సీక్వెల్ తో మళ్లీ తెరపైకి.. ఈసారి మామూలుగా ఉండదంటూ..?
సోనాక్షి సిన్హా కెరియర్..
ఫస్ట్ సినిమాతోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమాలో అవకాశం అందుకున్న ఈమె.. ‘దబాంగ్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుని బీటౌన్ క్రష్ గా పేరు సొంతం చేసుకుంది . ఈ సినిమా తర్వాత సన్నాఫ్ సర్దార్, దబాంగ్ 2, లూటేరా వంటి చిత్రాలతో భారీ స్థానం ను సొంతం చేసుకుని, అక్కడి నుండి ఈమెకు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఓటీటీ సినిమాలకు పరిమితమైంది. హీరామండి, కకుడా సినిమాలతో ప్రేక్షకులను చివరిగా అలరించిన ఈ ముద్దుగుమ్మ.. అదే ఏడాది హడావిడిగా పెళ్లి చేసుకుంది. ఇకపోతే ఈ విషయం ఈమె తల్లిదండ్రులకు తెలియకపోవడం గమనార్హం