Nayanthara:ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ హవా ఎక్కువగా నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక సినిమా విజయం సాధించింది అంటే ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు సైతం ఆసక్తి కనబరిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘దేవర’, ‘కల్కి’, ‘సలార్’ వంటి చిత్రాలు సీక్వెల్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు నయనతార (Nayanthara) సినిమా కూడా సీక్వెల్ కి సిద్ధం అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి నయనతార ఏ సినిమాకు సీక్వెల్ చేయబోతోంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
త్వరలో ‘మూకుత్తి అమ్మన్ 2’..
అసలు విషయంలోకెళితే.. నయనతార ప్రధాన పాత్రలో ఆర్జే బాలాజీ (RJ Balaji) తెరకెక్కించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘మూకుత్తి అమ్మన్’. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో నయనతార అమ్మోరు గెటప్ లో చాలా అద్భుతంగా ఒదిగిపోయి మరీ నటించింది. ఇకపోతే ఇదే సినిమాను తెలుగులో ‘అమ్మోరు తల్లి’ అనే టైటిల్ తో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ముక్కుపుడక అమ్మవారిగా నయనతార తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ సన్నాహాలు జరుగుతున్నాయి. ‘మూకుత్తి అమ్మన్ 2’ టైటిల్ తో సీక్వెల్ ను రూపొందించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ కి దర్శకుడు మారిపోయినట్లు తెలుస్తోంది. ఆర్ జె బాలాజీ కాకుండా ఈ సినిమాకి సుందర్ సి (Sundar.C) దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.
చెన్నైలో షూటింగ్ ఆరంభం..
స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని, ఈనెల 6వ తేదీన ఈ సినిమా షూటింగ్ ను చెన్నైలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. 15 రోజుల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్లో ఉన్న చిత్ర బృందం.. అందులో భాగంగానే చెన్నైలో ఒక భారీ సెట్ వేసి ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో చాలా అద్భుతంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళ్లో తెరకెక్కించి, ఆ తర్వాత పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే హార్రర్ థ్రిల్లర్ చిత్రాలు తెరకెక్కించడంలో దర్శకుడు సుందర్ సి కి ప్రత్యేకమైన మార్క్ ఉంది. అందులోనూ ఆధ్యాత్మిక అంశాన్ని బేస్ చేసుకొని ఆయన చాలా అద్భుతంగా సినిమాలను తెరకెక్కిస్తారు. అలాంటి ఈయన చేతిలోకి సీక్వెల్ పడితే ఇంకేమైనా ఉందా అది పక్క బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
సీక్వెల్ పై అంచనాలు పెట్టుకున్న నయనతార..
ఇకపోతే ఎప్పటినుంచో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సత్తా చాటాలని భారీ ప్రయత్నాలు చేస్తోంది నయనతార. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలను అందివ్వడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చుచేసినా.. కంటెంట్ లేకపోవడం వల్లే సినిమాలు డిజాస్టర్ గా నిలిచిపోతున్నాయి. ఇక అమ్మోరు తల్లి సినిమా బాగానే ఫేమస్ అయ్యింది కానీ ఆ తర్వాత మళ్లీ అలాంటి సినిమా పడలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సీక్వెల్ పై ఆశలు పెట్టుకుంది నయనతార. ఎప్పుడో ఐదేళ్ల క్రితం విడుదలైన ఈ అమ్మోరు తల్లి సినిమా సీక్వెల్ ఇప్పుడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Chiranjeevi: అబుదాబిలో హిందూ దేవాలయాన్ని సందర్శించిన చిరంజీవి.. మాటల్లో చెప్పలేనంటూ..?