Copper Utensils: రాగి పాత్రలు చూడటానికి అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కానీ కాలక్రమేణా అవి నల్లగా, రంగు మారడం ప్రారంభిస్తాయి. దీనివల్ల మెరుపును కూడా కోల్పోతాయి. ఇలాంటి పరిస్థితిలో.. ఈ పాత్రలు చాలా కాలం పాటు కొత్తగా కనిపించేలా వాటిని సరిగ్గా శుభ్రం చేయడం ముఖ్యం.
రాగి పాత్రలను శుభ్రం చేయడానికి ఖరీదైన రసాయనాలు అవసరం లేదు. వంటగదిలో ఉండే కొన్ని రకాల సాధారణ పదార్థాల సహాయంతో మీరు వాటిని సులభంగా మెరిసేలా చేసుకోవచ్చు. కొన్ని రకాల చిట్కాలు పాత్రలను మెరిసేలా చేయడమే కాకుండా.. వాటిపై ఎటువంటి హానికరమైన ప్రభావాన్ని చూపవు.
రాగి పాత్రలను శుభ్రం చేయడానికి చిట్కాలు :
నిమ్మరసం, ఉప్పు వాడకం:
రాగి పాత్రలపై నల్లటి పొరను తొలగించడానికి నిమ్మరnutsసం, ఉప్పు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. సగం కోసిన నిమ్మకాయను తీసుకొని.. దానిపై కొంచెం ఉప్పు చల్లి రాగి పాత్రపై రుద్దండి. కొన్ని నిమిషాలు రుద్దిన తర్వాత.. గోరువెచ్చని నీటితో పాత్రను కడగాలి. ఇది పాత్ర యొక్క మెరుపును తిరిగి తెస్తుంది. అంతే కాకుండా, అది తెల్లగా కనిపించడం ప్రారంభిస్తుంది.
వెనిగర్, పిండితో శుభ్రపరచడం:
ఒక చెంచా వెనిగర్లో కొద్దిగా గోధుమ పిండి కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్‌ను పాత్రపై రాసి కొంతసేపు అలాగే ఉంచండి. తర్వాత స్పాంజితో రుద్ది నీటితో కడగాలి. ఈ పరిహారం రాగిపై పేరుకుపోయిన మురికి ,తుప్పును తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. వెనిగర్ యొక్క ఆమ్ల లక్షణం, పిండి యొక్క రాపిడి శక్తి కలిసి అద్భుతాలు చేస్తాయి.
బేకింగ్ సోడా, నిమ్మకాయ పేస్ట్:
నిమ్మరసంతో బేకింగ్ సోడా కలిపి మందపాటి పేస్ట్ తయారు చేయండి. రాగి పాత్రపై రాసి కొంత సమయం అలాగే ఉంచండి. తరువాత మృదువైన బ్రష్‌తో స్క్రబ్ చేసి శుభ్రమైన నీటితో కడగాలి. ఈ పద్ధతి మొండి మరకలు, పాత్రలపై ఉన్న నలుపు తొలగించడానికి ప్రత్యేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది.
టమాటో రసం, ఉప్పు:
టమాటోలలో సహజ ఆమ్లం ఉంటుంది. ఇది రాగి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. టమాటోలో రసం తీసి, దానికి కొంచెం ఉప్పు వేసి.. ఈ మిశ్రమంతో పాత్రను రుద్దండి. 5-10 నిమిషాల తర్వాత పాత్రలను శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల పాత్రలు తిరిగి మెరుస్తాయి. ఈ పద్ధతి ముఖ్యంగా చిన్న పాత్రలు లేదా డెకరేషన్ ఐటమ్స్ కోసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: కరివేపాకులో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
పెరుగుతో శుభ్రపరచడం:
పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం రాగి పాత్రలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. కొంచెం పెరుగు తీసుకొని నేరుగా పాత్రపై అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత దానిని మృదువైన క్లాత్ లేదా బ్రష్ తో రుద్ది కడగాలి. ఈ పద్ధతి పాత్రను మెరిసేలా చేయడమే కాకుండా వాటిని దెబ్బతీయకుండా చేస్తాయి. పెరుగు రాగి పాత్రలను తెల్లగా మెరిసేలా చేస్తాయి.