E-Paper
Advertisement

Couple: డిన్నర్.. ఆ జంట జీవితాన్ని మార్చింది.. 13 కోట్లు సొంతం, అదెలా?

Couple: డిన్నర్.. ఆ జంట జీవితాన్ని మార్చింది.. 13 కోట్లు సొంతం, అదెలా?
Advertisement

Couple: ఓ జంట బయటకు డిన్నర్‌కి వెళ్లింది. ఏమనుకుందో తెలీదుగానీ వెళ్లే దారిలో 250 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. సరదాగా కొన్న ఆ టికెట్‌లో మహాలక్ష్మి ఉంటుందని ఊహించుకోలేకపోయింది. సుమారుగా 13 కోట్ల రూపాయలు గెలుచుకుంది. అమెరికాలోని న్యూజెర్సీలో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

ఐడియా జీవితాన్ని మారుస్తుందని ఓ సిమ్ కార్డు కంపెనీ ప్రధాన స్లోగన్. ఆ మాటేమోగానీ ఈ దంపతుల ఐడియా వారి జీవితాన్ని మార్చేసింది. ఏకంగా కోటీశ్వరులు అయిపోయారు.  దాదాపు 13 కోట్ల రూపాయలను దక్కించుకున్నారు. అదే అమెరికా కరెన్సీలో అయితే 1.5 మిలియన్లు డాలర్లు అన్నమాట.

Advertisement

న్యూజెర్సీలో నివసిస్తున్న ఓ జంట డిన్నర్ కోసం బయటకు వెళ్లింది. నట్లీ టౌన్‌షిప్‌లో లక్కీ 7 డెలిలో వైన్ ఫర్ లైఫ్! స్క్రాచ్-ఆఫ్ గేమ్ కోసం టిక్కెట్‌ను జంట కొనుగోలు చేసింది. ఆ టికెట్ విలువ కేవలం 250 రూపాయలు మాత్రమే. ఆ జంటకు అదృష్టం వరించింది.  1.5 మిలియన్ డాలర్లు లాటరీ వారి సొంతమైంది.  భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 13 కోట్లు అన్నమాట.

లాటరీ గెలిచిన తర్వాత ఆ జంట షాక్‌లో ఉంది. జంటలో ఒకరి పట్టుదల వల్ల లాటరీ గెలుచుకున్నామని, లేకుంటే జరిగేది కాదని చెబుతోంది. తొలుత తనకు అంతగా నచ్చలేదని తెలిపింది. ఇది నిజంగా మా జీవితాలను మార్చిందని అంటోంది. ఆ టికెట్ కొనే విషయంలో వారిద్దరి మధ్య చిన్నవాదన జరిగింది.

Advertisement

ALSO READ: లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు మృతి

ఒకరు పట్టణంలో కొనాలని, మరొకరు అక్కడేవున్న షాపులో కొందామని పట్టుబట్టారు. 10 డాలర్ల టికెట్‌తో పాటు రెండింటిని 3 డాలర్ల టికెట్లు కొనుగోలు చేశారు. మొదటి టికెట్‌ను స్క్రాచ్ చేయగా వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఊహించని విధంగా 1.5 మిలియన్ డాలర్లను సొంతం చేసుకున్నారు.

ఈ గేమ్‌లో టాప్-3 లాటరీ ప్రైజ్ మనీ గెలుపొందడంతోవారు డబ్బు తీసుకోకుండా ‘అన్యుటీ ఎంపిక’ స్కీమ్‌ను ఎంపిక చేసుకున్నారు. దీని ప్రకారం 25 సంవత్సరాల పాటు ఏడాదికొకసారి చెల్లింపులు అందుకుంటుంది ఈ జంట.  25 ఏళ్లు పూర్తి అయ్యేసరికి 1.5 మిలియన్ డాలర్లు ఆ జంట చేతికి రానుంది.

లాటరీ నిర్వాహకులు చెప్పిన వివరాలు మేరకు న్యూజెర్సీ లాటరీ 1970లో ప్రారంభించబడినప్పటి నుండి ఇప్పటివరకు ఆ రాష్ట్రానికి దాదాపు 33.7 బిలియన్లను అందినట్టు తెలిపింది. లాటరీ మొదలు పెట్టిన నుంచి ఆ సంస్థ ఇప్పటివరకు లాభాల్లో నడుస్తోంది కూడా.

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×