Sonam Kapoor: బాలీవుడ్‌లో ఎంతోమంది నెపో కిడ్స్ హీరోహీరోయిన్లుగా తమ కెరీర్లను ప్రారంభించారు. చాలావరకు ఈ నెపో కిడ్స్‌కు ఫ్యాన్స్ కంటే హేటర్సే ఎక్కువగా ఉంటారు. అలా హీరోయిన్‌గా తన కెరీర్‌లో అత్యధిక హేటర్స్‌ను సంపాదించుకున్న నెపో కిడ్ సోనమ్ కపూర్. తను నటించిన సినిమాలు, అందులో తన క్యారెక్టర్స్‌ను ఇప్పటికీ ప్రేక్షకులు ట్రోల్ చేస్తూనే ఉంటారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది సోనమ్. ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్‌లోనే బిజీగా గడిపేస్తోంది. కానీ అప్పుడప్పుడు ఫ్యాషన్ ఫోటోషూట్స్, ర్యాంప్ వాక్స్‌తో అందరినీ అలరిస్తుంది. తాజాగా ర్యాంప్ వాక్ చేస్తూ స్టేజ్‌పైనే ఏడ్చేసింది సోనమ్ కపూర్.
తనను గుర్తుచేసుకొని కన్నీళ్లు
తాజాగా ఒక ప్రముఖ ఆల్కాహాల్ బ్రాండ్ ఏర్పాటు చేసిన ర్యాంప్ వాక్ ఈవెంట్‌లో పాల్గొంది సోనమ్ కపూర్. అందులో వైట్ డ్రెస్, క్రీమ్ కలర్ ఫుల్ జాకెట్, కొప్పు నిండా గులాబీ పువ్వులతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ర్యాంప్ వాక్ కోసం స్టేజ్‌పైకి రాగానే సోనమ్ కపూర్ తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయింది. అందరికీ నమస్కారం చెప్తూ స్టేజ్‌పైనే ఏడ్చేసింది. దానికి కారణమేంటో తను స్వయంగా చెప్పకపోయినా ప్రేక్షకులకు అర్థమయ్యింది. ఇండియాలో ప్రముఖ ఫ్యాషన్ సెలబ్రిటీ డిజైనర్ అయిన రోహిత్ బాల్‌ను గుర్తుచేసుకొని సోనమ్ కన్నీళ్లు పెట్టుకుందని సోషల్ మీడియాలో బయటికొచ్చింది. రోహిత్ తనకు మంచి ఫ్రెండ్ కావడంతో అలాంటి వ్యక్తిని మిస్ అవుతూ స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టేసుకుందని తెలుస్తోంది.
క్లోజ్ ఫ్రెండ్
రోహిత్ బాల్ (Rohit Bal) 1986లో ఫ్యాషన్ డిజైనర్‌గా మారాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే తను సొంతంగా డిజైనింగ్ చేయడం మొదలుపెట్టాడు. అలా కొన్నాళ్లకే తనకు సెలబ్రిటీలతో పరిచయాలు ఏర్పాడ్డాయి. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలకు మాత్రమే కాదు.. వ్యాపారవేత్తలకు కూడా రోహిత్ బాల్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే తనను తమ పర్సనల్ డిజైనర్‌లాగా కూడా భావించేవారు. అలా ఎన్నో ఏళ్లు సెలబ్రిటీ డిజైనర్‌గా పనిచేసిన రోహిత్.. 2024 నవంబర్ 1న అకస్మాత్తుగా మృతిచెందాడు. తన మృతికి బాలీవుడ్ అంతా సంతాపం ప్రకటించింది. ఇతర సెలబ్రిటీలతో పోలిస్తే రోహిత్.. సోనమ్ కపూర్‌కు చాలా క్లోజ్ ఫ్రెండ్‌గా ఉండేవాడు. అందుకే తను లేకుండా ర్యాంప్ వాక్ చేస్తూ తనను మిస్ అయిన సోనమ్.. అందరి ముందు ఏడ్చేసింది.
Also Read: సల్మాన్ ఖాన్ సోదరి కి యాక్సిడెంట్.. ఇప్పుడు ఎలా ఉందంటే.?
అభిమానం దక్కలేదు
అనిల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సోనమ్ కపూర్ (Sonam Kapoor). తన చేతికి ఎంతో మంచి కథలు వచ్చినా కూడా అందులో తన యాక్టింగ్ మాత్రం ప్రేక్షకులకు నచ్చలేదు. ఎన్నో ఏళ్లు, ఎన్నో సినిమాల్లో నటించినా కూడా ప్రేక్షకుల దగ్గర నుండి సోనమ్‌కు అభిమానం మాత్రం దక్కలేదు. ఆ విషయం తనకు స్వయంగా తెలిసినా కూడా పెద్దగా పట్టించుకునేది కాదు. ఇక 2018లో ఆనంద్ అహూజా అనే బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకున్న సోనమ్.. ఆ తర్వాత సినిమాలను పూర్తిగా తగ్గించేసింది. సోనమ్ కపూర్ చివరిగా 2023లో ‘బ్లైండ్’ అనే ఉమెన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
#sonamkapoor breaks down on the ramp remembering the legendary designer #rohitbal pic.twitter.com/HNanIsdFOK
— BollyHungama (@Bollyhungama) February 2, 2025