SU Arun Kumar: గత కొన్నేళ్లలో సినీ సెలబ్రిటీల వివాహల సంఖ్య పెరుగుతూనే ఉంది. హీరోహీరోయిన్లు మాత్రమే కాదు.. సింగర్స్, డైరెక్టర్స్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఒక తమిళ దర్శకుడు కూడా ఈ లిస్ట్‌లో యాడ్ అయ్యాడు. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఎస్‌యూ అరుణ్ కుమార్ వివాహం తాజాగా ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి దాదాపు కోలీవుడ్ స్టార్ హీరోలంతా హాజరయ్యారు. మధురైలో జరిగిన ఈ పెళ్లికి చాలామంది స్టార్ హీరోలు హాజరయ్యి కొత్త జంటకు విషెస్ తెలిపారు. హీరోలు మాత్రమే కాదు.. హీరోయిన్లు కూడా తన పెళ్లిలో సందడి చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆశీర్వదించిన స్టార్లు
ఎస్‌యూ అరుణ్ కుమార్ పెళ్లికి సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందులో ఒక ఫోటోలో విక్రమ్, విజయ్ సేతుపతి, ఎస్‌జే సూర్య, సిద్ధార్థ్.. కలిసి కనిపించారు. వారితో పాటు ‘రాయన్’ బ్యూటీ దుషారా విజయన్ కూడా ఈ ఫోటోలు ఉంది. ఫిబ్రవరి 2న మధురైలో అరుణ్ కుమార్ వివాహం జరిగింది. మధురైకు చెందిన పరవయ్ అనే ఊరిలోనే అరుణ్ కుమార్ పుట్టి పెరిగాడు. ఇప్పటివరకు తను తెరకెక్కించిన చాలావరకు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి హిట్లు అందుకున్నాయి. ప్రస్తుతం తను విక్రమ్ హీరోగా ‘వీర ధీర శూరన్’ (Veera Dheera Sooran) అనే మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ నుండి ప్రారంభమయిన అరుణ్ కుమార్ ప్రయాణం.. ఇప్పుడు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసేవరకు వచ్చింది.
షార్ట్ ఫిల్మ్స్‌తో మొదలు
ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఇప్పటివరకు ‘పన్నయరుమ్ పద్మినియుమ్’, ‘చిత్త’, ‘సింధుబాద్’, ‘సేతుపతి’ వంటి సినిమాలు తెరకెక్కాయి. తన డెబ్యూ మూవీ అయిన ‘పన్నయరుమ్ పద్మినియుమ్’ బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ సాధించకపోయినా.. తనకు దర్శకుడిగా మంచి గుర్తింపు మాత్రం లభించింది. తను తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్‌నే ఈ సినిమాగా మార్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక విజయ్ సేతుపతితోనే కలిసి ‘సింధుబాధ్’, ‘సేతుపతి’ వంటి రెండు కమర్షియల్ సినిమాలు తెరకెక్కించి హిట్లు కొట్టాడు అరుణ్ కుమార్. సినిమాలు మాత్రమే కాదు.. తను తెరకెక్కించిన ఒక డాక్యుమెంటరీ కూడా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
Also Read: యష్ మూవీలో కియారాకు అవమానం.. హీరో అసంతృప్తి..!
కంటతడి పెట్టించాడు
2020లో తెంకసీలో జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసుల ఆధారంగా ‘ఇమైక్క విరిగల్’ అనే డాక్యుమెంటరీని తెరకెక్కించాడు ఎస్‌యూ అరుణ్ కుమార్ (SU Arun Kumar). తను చివరిగా సిద్ధార్థ్ హీరోగా ‘చిత్తా’ అనే సోషల్ డ్రామాను తెరకెక్కించాడు. ఆ సినిమాతో ప్రేక్షకులను కంటతడి పెట్టించడంతో పాటు వారికి మరింత దగ్గరయ్యాడు. అలా తను డైరెక్ట్ చేసిన హీరోలంతా తన పెళ్లికి వచ్చి కొత్తజంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం అరుణ్ కుమార్.. విక్రమ్‌తో తెరకెక్కిస్తున్న ‘వీర ధీర శూరన్’తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, గ్లింప్స్‌లు విడుదల కాగా.. వాటికి మంచి రెస్పాన్స్ లభించింది. 2025 మార్చిలో ఈ మూవీ విడుదల కానుంది.
Our legend @chiyaan 🔥😍 graced the wedding of Dir #SuArunkumar with his love and blessings!"#Chiyaanvikram🔥🔥 #VeeraDheeraSooran #Chiyaan63@sooriaruna @Kalaiazhagan15@proyuvraaj @mugeshsharmaa pic.twitter.com/vLAHSjXDKf
— Chiyaan Vikram Fans (@chiyaanCVF) February 2, 2025