BigTV English

census Budget : ఈసారి జనాభా లెక్కింపు లేనట్టేనా.. కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తుంది

census Budget : ఈసారి జనాభా లెక్కింపు లేనట్టేనా.. కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తుంది

Census Budget : దేశంలోని మొత్తం జనాభా సమగ్ర వివరాలు తెలుసుకునేందుకు భారత్ లో జనగణన నిర్వహిస్తు ఉంటారు. ఇది కేంద్ర ప్రభుత్వం స్థాయిలో జరిగే ఓ అధికారిక ప్రక్రియ. జనగణన ప్రతీ పదేళ్లకు ఓసారి నిర్వహిస్తుంటారు. స్వతంత్ర భారత్ లో మొదటిసారిగా 1951లో నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి దశాబ్దానికి ఒక సారి ఈ ప్రక్రియ చేపడుతున్నారు. అలా.. 2020-21 ఏడాదిలో దేశ వ్యాప్తంగా జనగణన నిర్వహించాల్సి ఉంది. కానీ.. అప్పుడు కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు. కొవిడ్ తగ్గిపోయి, తిరిగి ప్రభుత్వ, ప్రజా కార్యక్రమాలు తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా.. కేంద్రం జనగణన చేపట్టేందుకు వెనుకాడుతోంది. తాజాగా.. ఈ ఏడాది ఆ ప్రక్రియను చేపడతారని అంతా భావించారు. కానీ.. కేంద్ర బడ్జెట్ లో జనగణనకు అతిస్పల్పంగా కేటాయింపులు జరపడంతో ఈసారి వాయిదా వేసినట్లే అని భావిస్తున్నారు.


తాజాగా ప్రకటించిన బడ్జెట్లో దేశ వ్యాప్త జనాభా లెక్కల సేకరణకు అతి స్వల్పంగా రూ.574.80 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది 2024-25 బడ్జెట్‌లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.572 కోట్లు ప్రతిపాదించారు. ఇలా వరుసగా రెండేళ్లు నిధులు కేటాయింపులు చేయకపోవడంతో.. ఈ ఏడాది కూడా జనగణనకు కేంద్రం సుముఖంగా లేదనే సంకేతాలిస్తోంది అంటున్నారు విశ్లేషకులు.

పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కేంద్ర హోంశాఖకు భారీగానే కేటాయింపులు చేశారు. గతేడాది రూ.2,19,643.31 కోట్లు కేటాయించగా… ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర హోంశాఖ కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. దాదాపు 6 శాతం ఎక్కువ కేటాయింపులతో రూ.2,33,210.68 కోట్లను ఈ పద్దు కింద ప్రతిపాదించారు. ఇందులో ఎక్కువగా సరిహద్దు భద్రతా దళాలైన సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌ వంటి కేంద్ర పోలీసు బలగాలకు రూ.1,60,391.06 కోట్లు నిధులు దక్కాయి. మిగతా వాటితో కేంద్ర హోం శాఖ ఆర్థిక కార్యకలాపాలు సాగనున్నాయి.


ఈ నిధుల్లో కేంద్ర పోలీసు బలగాలకు విభాగాల వారీగా చూస్తే.. సీఆర్పీఎఫ్‌కు రూ.35,147.17 కోట్లు, బీఎస్‌ఎఫ్‌కు రూ.28,231.27 కోట్లు, సీఐఎస్‌ఎఫ్‌కు రూ.16,084.83 కోట్లు, ఐటీబీపీకి రూ.10,370 కోట్లు, సశస్త్ర సీమా బల్‌కు రూ.10,237 కోట్లు, అస్సాం రైఫిల్స్‌ దళానికి రూ.8,274.29 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ లెక్కల్లో ఎక్కడా జనగనణ కోసం కానీ దాని అనుబంధ విభాగాలకు కానీ ప్రత్యేక కేటాయింపులు లేవు. దీంతో.. ఈ ఏడాది సైతం జనగణన అంశాన్ని కేంద్రం పక్కన పెట్టిందనే భావించాలంటున్నారు విశ్లేషకులు.

Also Read :

దేశంలోని ప్రజల స్థితిగతులపై నిర్దిష్టమైన సమాచారం సేకరించడం.. సమాజంలోని వివిధ వర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఆరోగ్య, విద్యా స్థితిగతులపై స్పష్టమైన అవగాహన కోసం ఈ జనగణనను చేపడుతుంటారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోని ప్రజలకు కలిసి.. కుటుంబాల వారీగా లెక్కలు తీసుకుంటారు. ఇందులో కుటుంబ సభ్యుల సంఖ్య, వారి వయస్సు, లింగ నిష్పత్తి, విద్యా స్థాయి, ఉపాధి రంగం, వారిచే మాట్లాడే భాష, జీవన ప్రమాణాలు, వలస, భౌగోళిక విభజన వంటి అనేక అంశాలు ఉంటాయి. ఈ వివరాలు ఒక దేశ అభివృద్ధికి అవసరమైన పలు రంగాలలో కీలకంగా ఉపయోగపడతాయి.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×