Sonu Sood: రీల్ హీరోలు చాలామంది ఉంటారు. కానీ సినిమాల్లో చేసే గొప్ప పనులు ఆఫ్ స్క్రీన్ చేసి రియల్ హీరో అనిపించుకునే వారు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో సోనూ సూద్ ఒకరు. కోవిడ్ సమయంలో సోనూ సూద్ చేసిన సాయం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు మర్చిపోలేరు. అలాంటి సోనూ సూద్ పర్సనల్ లైఫ్‌లో ఒక చేదు ఘటన ఎదురయ్యింది. ఇటీవల తన భార్య సోనాలి సూద్ కారు యాక్సిడెంట్‌కు గురయ్యింది. తాజాగా సోనాలి సూద్‌కు కారు యాక్సిడెంట్ కావడంతో గాయాలు అయ్యాయి. ఇప్పటివరకు దీనిపై స్పందించని సోనూ సూద్.. తాజాగా దీనిపై మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాడు.
దానివల్లే సేవ్ అయ్యారు
తాజాగా సోనాలి సూద్ (Sonali Sood) యాక్సిడెంట్ గురించి వివరిస్తూ.. ప్రజలు కూడా వాహనాలు నడిపే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు సోనూ సూద్. ‘‘మీకొక ముఖ్యమైన మెసేజ్ ఉంది. గతవారం ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ కారు యాక్సిడెంట్‌లో నా భార్యకు, తన మేనల్లుడికి, తన చెల్లెలికి గాయాలు అయ్యాయి. ఆ యాక్సిడెంట్‌లో కారు ఏ కండీషన్‌లోకి వెళ్లిందో ప్రపంచమంతా చూసింది. వారిని ఎవరైనా సేవ్ చేశారంటే అది సీట్ బెల్టే’’ అంటూ వారు సీట్ బెల్ట్ వల్లే బ్రతికి బయటపడిన సందర్భం గురించి మాట్లాడారు సోనూ సూద్. దాంతో పాటు సీట్ బెల్ట్ వల్ల ప్రయోజనాలు ఏంటో కూడా చెప్పుకొచ్చారు.
చాలామంది అంతే
‘‘కొన్ని క్షణాల్లో చాలా జరిగిపోతుంది. ముఖ్యంగా కారులో వెనుక కూర్చునేవారు సీట్ బెల్ట్ పెట్టుకోరు. ఆరోజు సునిత కారులో కూర్చున్నప్పుడు నా భార్య తనను వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పింది. తను సీట్ బెల్ట్ పెట్టుకోగానే కారుకు యాక్సిడెంట్ అయ్యింది. కారులో ఉన్న అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే క్షేమంగా ఉన్నారు. కారులో బ్యాక్ సీట్‌లో కూర్చునే 100 మందిలో 99 మంది సీట్ బెల్ట్ పెట్టుకోరు. డ్రైవర్స్ కూడా పోలీస్ ఫైన్స్‌ను తప్పించుకోవడానికి మాత్రమే సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. అవి కూడా సరిగా పెట్టుకోరు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ముందు కూర్చునేవాళ్ల బాధ్యత మాత్రమే కాదు. అసలు ఎవరూ సీట్ బెల్ట్ లేకుండా కారులో కూర్చుకోడదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను’’ అని తెలిపారు సోనూ సూద్.
Also Read: హీరోయిన్ రేంజ్‌లో ఉన్నా తల్లిదండ్రుల సపోర్ట్ లేదు.. ఖుష్భూ కూతురి కామెంట్స్
కుటుంబం లేనట్టే అనుకోండి
‘‘పోలీసులకు చూపించడం కోసం, సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టు కనిపించడం కోసం కొందరు క్లిప్ పెట్టుకోరు. కానీ మీరు, మీ కుటుంబ సభ్యులు కచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. కారులో వెనుక కూర్చున్న వారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మీకు కుటుంబం లేనట్టే’’ అని చెప్తూ తన సందేశాన్ని ముగించారు సోనూ సూద్ (Sonu Sood). ప్రస్తుతం సోనూ సూద్ ‘ఫతే’ అనే సినిమాలో నటసి్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. చాలాకాలంగా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతున్నా కూడా పలు కారణాల వల్ల ఇంకా విడుదల కాలేదు. ఇందులో కూడా ఒక సోషల్ మెసేజ్‌తోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు సోనూ సూద్. ఎంతైనా రీల్ హీరో కంటే రియల్ హీరోగానే సోనూ సూద్‌కు అభిమానులు ఎక్కువ.