Khushbu Sundar: మామూలుగా నెపో కిడ్స్‌కు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం చాలా ఈజీ అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తుంటారు. అది చాలావరకు నిజమే అని ఇండస్ట్రీ నిపుణులు కూడా ఒప్పుకుంటారు. ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం వరకు ఈజీ అయినా ఆ తర్వాత వారికి హిట్స్ అందుతాయా, ఫ్లాప్స్ అందుతాయా అనేది వారి టాలెంట్‌పైనే ఆధారపడి ఉంటుంది. అయితే కొందరు నెపో కిడ్స్ అయినా కూడా వారికి తల్లిదండ్రుల దగ్గర నుండి సపోర్ట్ ఉండదు అనే కామెంట్స్ వినిపిస్తున్నా అది ఎవరూ నమ్మరు. తాజాగా సీనియర్ హీరోయిన్ ఖుష్బూ వారసురాలు అవంతిక సుందర్ సైతం తనకు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి తల్లిదండ్రుల సపోర్ట్ దొరకడం లేదని కామెంట్స్ చేసింది.
తల్లిదండ్రుల సలహాలు
తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంటర్ అయిన తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలతో జోడీకట్టి మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ అయిపోయింది ఖుష్భూ. తర్వాత రాజకీయాల్లో కూడా తన లక్‌ను ట్రై చేసింది. ఆపై ఫుల్ టైమ్ రాజకీయాల్లోనే సెటిల్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతోంది ఖుష్భూ (Khushbu). ఇదే సమయంలో తన కుమార్తె అవంతిక సుందర్ కూడా సినిమాల్లోకి రావాలనే కోరికను బయటపెట్టింది. ‘‘అసలు నా సినీ కెరీర్‌లో ఏం చేయాలని నా తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పలేదు. నాకు ఏది సౌకర్యంగా ఉంటుందో అదే చేయమన్నారు’’ అని చెప్పుకొచ్చింది అవంతిక.
లాంచ్ చేయరు
‘‘నేనెప్పుడూ నా తల్లిదండ్రులు నన్ను లాంచ్ చేస్తారని అనుకోలేదు. నాకు అలా ఎప్పుడూ అనిపించలేదు. కానీ నన్ను స్వయంగా ఎవరైనా వచ్చి అప్రోచ్ అవ్వాలని చెప్పినా, నాకు నేనే కష్టపడతాను అని చెప్పినా అది అబద్ధమే అవుతుంది. నా తల్లిదండ్రుల వల్ల ఇండస్ట్రీలో నా కాలు పడడం కష్టమేమి కాదు అని చెప్పడంలో తప్పు లేదు అనుకుంటున్నాను. కనీసం ఇండస్ట్రీ వాళ్లతో నన్ను పరిచయం చేయమని అమ్మను అడుగుతూనే ఉంటాను. అయినా వాళ్లు నన్ను లాంచ్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. నాకు నేనే సొంతంగా చేసుకోవాలి అన్నదే నా ఆలోచన. కానీ నా అడ్వేంటేజ్ ఏంటంటే నా తల్లిదండ్రులు నాకు ఉన్నారు. వాళ్ల సపోర్ట్ లేకుండా నాకు ఇది అసాధ్యం అన్నది మాత్రమే నిజం’’ అని చెప్పుకొచ్చింది అవంతిక సుందర్ (Avantika Sundar).
Also Read: 65 ఏళ్ల నటుడితో మాళవికా రొమాన్స్ అంటూ కామెంట్స్.. ఇచ్చిపడేసిన హాట్ బ్యూటీ
ప్రేక్షకులు స్మార్ట్
‘‘నేను నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ సక్సెస్‌ఫుల్ అవ్వాలని ఏమీ అనుకోవడం లేదు. నేను నా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. నేను అక్కడ వరకు వెళ్తానని కూడా అనుకోవడం లేదు. నేను ఫెయిల్ అవుతానని భయంగా ఉంది. కానీ నేను ట్రై చేసి ఫెయిల్ అయినా నన్ను సపోర్ట్ చేసే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్యే నేను పెరిగాను. ఒకరకంగా ప్రేక్షకులు నిన్ను ఇష్టపడ్డారంటే ఆదరిస్తారు. ఆడియన్స్ అనేవారు చాలా స్మార్ట్ అయిపోయారు. వాళ్లు కూడా వాళ్ల అభిప్రాయాలను ఓపెన్‌గా చెప్తున్నారు. అది నాకు నచ్చుతుంది. కాబట్టి ఫెయిల్యూర్ అనేది అంత భయం అనిపించడం లేదు. కానీ నేను చెప్పినట్టుగా నాకు మంచి సపోర్టింగ్ సిస్టమ్ ఉంది’’ అని తెలిపింది అవంతిక సుందర్.