TGSRTC: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. టీజీఎస్‌ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసీ ప్రత్యక్ష సమ్మెకు శంఖం పూరించింది. మే 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె ఉంటుందని ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు.
ALSO READ: Rajiv Yuva Vikasam: రూ.4,00,000 స్కీంకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా వారం రోజులే గడువు మిత్రమా..!
తమ డిమాండ్లను పరిష్కరించకపోతే మే 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ వెల్లడించింది. కాగా ఇంతకు ముందే.. జనవరి నెలలో తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జాక్ సంస్థకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సమ్మెకు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె నిర్వహించేందుకే టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ రెడీ అయ్యింది. ఈ మేరకు ఈ రోజు లేబర్ ఆఫీసులో సమావేశం అయిన నేతలు.. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేసేందుకు తేదీని కూడా నిర్ణయించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఎంత వరకు అయినా వెళ్తామని వారు హెచ్చరించారు. కాగా తమ సమ్మెకు మహిళాసంఘాలు, ప్రజాసంఘాలు, అన్ని యూనియన్లు కలిసి రావాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు.
ALSO READ: IREL Recruitment: డిగ్రీ పాసైన వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు.. లక్షల్లో శాలరీలు.. ఇంకెందుకు ఆలస్యం..!
ALSO READ: BEL Jobs: హైదరాబాద్, బెల్‌లో ఉద్యోగాలు.. మంచి సాలరీ, ఇంకా 2 రోజులే గడువు