Sonu Sood Wife Accident:ప్రముఖ స్టార్ హీరో సోనూ సూద్ (Sonu Sood) భార్య సోనాలి సూద్ (Sonali Sood) భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ముంబై – నాగ్ పూర్ హైవేపై ప్రయాణిస్తున్న సోనాలి సూద్ కారును.. అదుపుతప్పిన లారీ ఒకటి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా ఈ ప్రమాదంలో సోనూసూద్ భార్య సోనాలి సూద్ తో పాటు ఆమె సోదరి అలాగే ఆమె మేనల్లుడు కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ చాలా చాకచక్యంగా కారును అదుపు చేసి, ప్రమాదం నుంచి తప్పించారు. అయితే ఈ ప్రమాదంలో సోనాలి సూద్ కి చిన్నచిన్న గాయాలు కావడంతో.. ఆమెను ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ ఆమె కాస్త కుదిట పడ్డారని సమాచారం. ఇకపోతే ఈ సందర్భంగా అభిమానులు ఆందోళనకు గురి కావద్దని సోనూ టీం మీడియాతో తెలిపారు. మొత్తానికి అయితే సోనాలి సూద్ భారీ యాక్సిడెంట్ నుండి తృటిలో తప్పించుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇకపోతే నిన్న రాత్రి ఈ యాక్సిడెంట్ జరగగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
సోనూసూద్ కెరియర్..
సోనూసూద్ కెరియర్ విషయానికి వస్తే.. భారతీయ నటుడిగా పేరు దక్కించుకున్న ఈయన తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. సోనుసూద్ పంజాబ్ లోని మోగా అనే పట్టణంలో 1973 జూలై 30వ తేదీన జన్మించారు. ఇండస్ట్రీ లోకి రావాలనే కోరికతో నాటకాలలో తన నటనను కనబరిచిన ఈయన.. ఆ తర్వాత తెలుగులో ‘అరుంధతి’ సినిమా చేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం కూడా లభించింది.ఇకపోతే సోనూసూద్ నటుడు మాత్రమే కాదు మంచి సామాజిక వేత్త కూడా.. భారత దేశంలో కరోనా వ్యాప్తి సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో.. బ్రతుకుతెరువు కోసం వివిధ ప్రదేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకున్న వారిని సొంత ఖర్చులతో.. తమ ఊర్లకు పంపించడమే కాకుండా ఆక్సిజన్ కొరత ఉన్నచోట్ల సిలిండర్లను కూడా సమకూర్చి, ఉపాధి కోల్పోయిన వారికి బ్రతుకు పెరుగు కూడా చూపించి వార్తల్లో నిలిచారు.
సోను సూద్ వ్యక్తిగత జీవితం..
నాగపూర్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈయన.. ఆ తర్వాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ వంటివి కూడా చేసేవాడు. ఇక అప్పుడే సినిమాల్లోకి రావాలనుకున్న ఈయన.. నెల రోజులపాటు నటనలో శిక్షణ తీసుకున్నాడు. 1996లో మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన మహిళ సోనాలిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారుఇక కరోనా సమయంలో తన భార్య ఆస్తులను కూడా అమ్మి ఇతరులకు సహాయం అందించారు.అందుకే తెలుగు ప్రజలు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
Naga Vamshi:సందీప్‌ని గుడ్డిగా నమ్మేస్తా… ప్రొడ్యూసర్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా..?