Naga Vamshi:సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక దర్శకుడు మీద నమ్మకం ఉంది అంటే.. కచ్చితంగా ఏ నిర్మాత అయినా సరే వారితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి కూడా వెనుకాడరు. ఉదాహరణకు రాజమౌళి సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ కాబట్టి.. ఆయన సినిమాలు నిర్మించడానికి ఏ ఒక్క నిర్మాత వెనుకాడరనే చెప్పాలి. అయితే ఎలాంటి నిర్మాత అయినా సరే ఒక సినిమా చేయాల్సి వస్తే.. ఆ దర్శకుడు ఎంత పెద్ద తోపైనా సరే వాళ్ళు చెప్పే స్క్రిప్ట్ నచ్చితేనే నిర్మించడానికి సిద్ధమవుతారు. కానీ ఇక్కడ ఒక నిర్మాత మాత్రం ఆ డైరెక్టర్ కథ చెప్పకపోయినా గుడ్డిగా నమ్మి సినిమా చేస్తానని చెబుతున్నారు. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఈ ప్రొడ్యూసర్ లో ఆ యాంగిల్ కూడా ఉందా? అనే అనుమానాలు కూడా నెటిజెన్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
సందీప్ రెడ్డి వంగా పై అతి నమ్మకం చూపిస్తున్న నాగవంశీ..
అసలు విషయంలోకి వెళ్తే.. వారెవరో కాదు నిర్మాత నాగవంశీ (Naga Vamshi). డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga).. సందీప్ రెడ్డివంగా అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, ఇప్పుడు ప్రభాస్ (Prabhas ) తో ‘స్పిరిట్’ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి డైరెక్టర్ పై నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగ వంశీ సందీప్ పై తనకున్న నమ్మకాన్ని ఒక్క మాటలో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇంటర్వ్యూలో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ..” “అర్జున్ రెడ్డి.. సందీప్ రెడ్డి వంగా వచ్చి నన్ను సినిమా నిర్మించమని అడిగి ఉంటే – స్క్రిప్ట్ తెలియకపోయినా నేను గుడ్డిగా సినిమా నిర్మించే వాడిని. అతనిపై నాకు ఉన్న నమ్మకం అంత గొప్పది.” అంటూ నిర్మాత నాగ వంశీ కామెంట్లు చేశారు. అయితే ఇది విన్న నెటిజెన్స్ నాగవంశీలో ఈ యాంగిల్ కూడా ఉందా.. ? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Tollywood: తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న యంగ్ హీరోయిన్స్.. వర్కౌట్ అయ్యేనా..?
సందీప్ రెడ్డి వంగ కెరియర్..
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ విషయానికి వస్తే.. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సంచలనం సృష్టించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యువతకు బాగా కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ తెచ్చుకుంటున్న ఈయన.. ఇప్పుడు స్పిరిట్ మూవీ తో ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నారని సమాచారం. ఇందులో ప్రభాస్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ స్పిరిట్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
నాగ వంశీ కెరియర్..
నాగ వంశీ విషయానికొస్తే.. గుంటూరు కారం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లక్కీ భాస్కర్, టిల్లు స్క్వేర్, డాకు మహారాజ్, డీజే టిల్లు ఇలా పలు చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు కింగ్ డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈయన ఊహించని విషయాలు చెబుతూ తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం నాగవంశీ సందీప్ రెడ్డి వంగా గురించి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.