BigTV English

Jobs: ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. ఈ రోజే లాస్ట్ డేట్

Jobs: ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. ఈ రోజే లాస్ట్ డేట్

Bank Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. బీటెక్, బీఈ, సీఏ, ఎల్ఎల్ఎం, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. కర్నాటక బ్యాంక్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.


కర్నాటక బ్యాంక్ లో 75 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోండి. నేటితోనే దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ రోజు రాత్రి 12 గంటల లోపు దరఖాస్తు పెట్టుకోండి.

ALSO READ: AIIMS Recruitment: గుడ్ న్యూస్.. సొంత రాష్ట్రలో ఉద్యోగం.. జీతమైతే నెలకు రూ.26,500


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 75

కర్నాటక బ్యాంక్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. చార్టెరెడ్ అకౌంటెంట్, లా ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్, ఐటీ స్పెషలిస్ట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

వెకెన్సీ వారీగా ఉద్యోగాలు:

చార్టెరెడ్ అకౌంట్: 25 ఉద్యోగాలు

లా ఆఫీసర్: 10 ఉద్యోగాలు

స్పెషలిస్ట్ ఆఫీసర్: 10 ఉద్యోగాలు

ఐటీ స్పెషలిస్ట్ : 30 ఉద్యోగాలు

దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 మార్చి 20

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 25

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి విద్యార్హత ఉంది. చార్టెరెడ్ అకౌంట్ పోస్టుకు సీఏ పాసై ఉండాలి. ఫస్ట్ త్రీ అటెంప్ట్ లలోనే సీఏ పాసై ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

లా ఆఫీసర్ పోస్టుకు మాస్టర్ ఆఫ్ లా (ఎల్ఎల్ఎం) పాసై ఉండాలి.

స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుకు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పాసై ఉంటే సరిపోతుంది.

ఐటీ స్పెషలిస్ట్ ఉద్యోగానికి బ్యాచులర్ ఆఫ్ ఇంజినీరింగ్ (బీఈ), లేదా ఐటీ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ), మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్), బీటెక్ లో ఐటీ పాసై ఉండాలి.

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం ఉంటుంది.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ణయించారు. జనరల్ మేనేజర్ ఉద్యోగానికి 55 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగానికి 50 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగానికి 45 ఏళ్లు, చీఫ్ మేనేజర్ ఉద్యోగానికి 40 ఏళ్లు, సీనియర్ మేనేజర్ ఉద్యోగానికి 25 నుంచి 38 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

నోటగిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://karnatakabank.com/

అప్లికేషన్ లింక్: https://karnatakabanksr.azurewebsites.net/

అర్హత కలిగిన అభ్యర్థులు కర్నాటక బ్యాంక్ లోని ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడే అప్లై చేయండి. ఉద్యోగం కొట్టండి.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 75

దరఖాస్తుకు లాస్ట్ డేట్: మార్చ్ 25 (ఈ రోజు రాత్రి 11:59 గంటల లోపే అప్లై చేసుకోవాలి)

ALSO READ: JOBS: టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ.68,000 జీతం.. దరఖాస్తుకు ఇంకా వారం రోజులే ఛాన్స్..

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×