Mad Square Day 3 Collections : మార్చి 28 న థియేటర్లలో సందడి చేసిన యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలు పెట్టింది.. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీగానే వసూలు చేస్తుంది. గతంలో వచ్చిన మ్యాడ్ మూవీ కి సీక్వెల్ గా రావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. అయితే థియేటర్లోకి వచ్చిన తర్వాత ఊహించిన దాని కంటే ఎక్కువగానే కలెక్షన్స్ రావడం నిజంగానే ఆశ్చర్యమని చెప్పాలి. మొదటి షో నుంచి కాసుల వర్షం కురుస్తుంది. రెండు రోజులకు 50 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది. మరి మూడు రోజులకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
మ్యాడ్ స్క్వేర్ మూవీ..
2023 అక్టోబర్ 6న ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు వచ్చిన కామెడీ, లవ్, యూత్ ఫల్ కంటెంట్ ‘మ్యాడ్’ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.. మూవీకి సీక్వెల్ గాని ఈ మూవీ తెరకెక్కింది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా సక్సెస్ అందుకుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. స్యూరదేవర నాగవంశీ సమర్పించగా.. హారిక స్యూరదేవర, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, థమన్ నేపథ్య సంగీతం అందించారు.. ఈ సినిమాకు కేవలం ఎనిమిది కోట్లు ఖర్చు చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో 450 థియేటర్లలో, వరల్డ్ వైడ్ గా 650 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. అయితే ఈరోజు మూవీ బాక్సాఫీస్ వద్ద దున్నెస్తుంది. దాదాపుగా 50 కోట్లకు చేరువలో ఈ మూవీ గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చేసింది. మూడు రోజులకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందంటే..
మూడు రోజుల కలెక్షన్స్..
మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుపోవడంతో పాటు కలెక్షన్స్ కూడా వసూలు చేస్తుంది. ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 20 కోట్లు వరకు వసూల్ చేసి రికార్డు బ్రేక్ చేసింది. అదే విధంగా రెండో ఫస్ట్ వీకెండ్ లో మొదటి శనివారం కావడంతో జోరుగానే వసూళ్లు రాబట్టింది. మొదటి రోజుకు కు తగ్గకుండా రెండో రోజు కూడా భారీగానే వసూల్ చేసింది. టోటల్ గా రూ. 37.2 కోట్లు వసూల్ చేసింది. అదే విధంగా మూడో రోజు కూడా రూ. 14.91 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది. రూ.52.1 కోట్లు వసూల్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇదే జోరులో ఈ నెల అంతా కలెక్షన్స్ వస్తే మాత్రం కచ్చితంగా 500 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు.