Manoj Mother Nirmala Devi : సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మంచు కుటుంబ(Manchu Family)గొడవలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. ముఖ్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలను రోడ్డుపైకి తీసుకురావడంతో ఉన్న పరువు కూడా పోయిందని మంచు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. క్షణికా వేషంలో చేసే తప్పులు జీవితకాలం సరిదిద్దుకున్నా పోవు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు ముఖ్యంగా నెటిజన్స్ మోహన్ బాబు(Mohan Babu)జర్నలిస్టులపై దాడి చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకొని కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా డిసెంబర్ 14వ తేదీన మోహన్ బాబు రెండవ భార్య, మంచు మనోజ్(Manchu Manoj)తల్లి, నిర్మల మోహన్ బాబు(Nirmala Mohan Babu)పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ వేడుకను సెలబ్రేట్ చేయడానికి మంచు విష్ణు (Manchu Vishnu)కేక్ తీసుకొని జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వచ్చారు. అయితే ఆ సమయంలో కరెంటు పోయిందని జనరేటర్ ఆన్ చేసి చూడగా.. తన అన్నయ్య కనిపించారని, పంచదార పోసి తమను చంపాలని చూశాడు అంటూ మంచు మనోజ్ ఆరోపణలు చేస్తూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా దీనిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి నిర్మల మోహన్ బాబు లేఖ పంపారు.
విష్ణు అమాయకుడు అంటూ మనోజ్ తల్లి లేఖ..
అందులో ఆమె.. డిసెంబర్ 14వ తేదీన మంచు విష్ణు నా పుట్టినరోజు సందర్భంగా కేక్ తీసుకొచ్చి, కట్ చేయించి, తన రూమ్లో ఉన్న సామానును తీసుకొని వెళ్ళిపోయారు. ఉన్న కొద్దిసేపు సమయం కూడా నాతోనే గడిపాడు. విష్ణు అమాయకుడు. మంచు మనోజ్ విష్ణు పై చేసిన ఆరోపణలలో నిజం లేదు. జల్పల్లి లో ఉన్న మోహన్ బాబు ఇంటి పై మనోజ్ కి ఎంత హక్కు ఉందో.. విష్ణు కి కూడా అంతే హక్కు ఉందని ఆమె తెలిపింది. దీంతో ఈ విషయం కాస్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖ చూసిన ప్రతి ఒక్కరూ కూడా రకరకాల కామెంట్లు వ్యక్తపరుస్తున్నట్లు సమాచారం. ఇంత సడన్ గా.. అందులోనూ మనోజ్ ఇంట్లో లేని సమయంలో నిర్మల మోహన్ బాబు కన్న కొడుకుకు వ్యతిరేకంగా,అక్క కొడుకైన విష్ణుకి సపోర్టుగా లేఖ వదలడంతో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
నిర్మల మోహన్ బాబు లేఖపై కొత్త అనుమానాలు..
ఇదిలా ఉండగా మరోవైపు మంచు మనోజ్ తన తల్లి పుట్టిన రోజు వేడుక పూర్తయిన తర్వాత.. అక్కడ జరిగిన విషయాన్ని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో తెలిపి విష్ణు పై కంప్లైంట్ ఇచ్చారు అనంతరం నిన్న అనగా డిసెంబర్ 16వ తేదీన తన భార్య మౌనిక, ఇద్దరు పిల్లలతో కలిసి దివంగత రాజకీయ నేత భూమా నాగిరెడ్డి సమాధిని దర్శించుకోవడానికి ఆళ్లగడ్డకి వెళ్లారు. అయితే ఇప్పుడు మంచు టౌన్షిప్ లో మనోజ్ లేడు కాబట్టి మంచు నిర్మలతో విష్ణునే కావాలని ఈ లెటర్ రాయించి ఉంటాడు అంటూ మనోజ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే నిర్మల నుంచి ఒక లెటర్ గనుక వస్తే మోహన్ బాబు లాగా ఆమె కూడా ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వాలి కదా అంటూ అటు నెటిజన్స్ కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటివరకు మనోజ్ పై విష్ణు చేసిన కామెంట్లకు పూర్తి నెగెటివిటీ ఏర్పడింది దానిని సరిపుచ్చుకోవడానికి మనోజ్ తల్లి అయిన నిర్మల మోహన్ బాబు చేత విష్ణు కావాలని ఒక లేఖ విడుదల చేయించాడనే కామెంట్లు కూడా నెటిజెన్స్ నుంచి వ్యక్తమౌతూ ఉండడం గమనార్హం మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు నిర్మలాదేవి వదిలిన లేఖ.. ఆమె మనస్ఫూర్తిగా విడుదల చేసిందా లేక విష్ణు బలవంతం చేస్తే పహాడీ షరీఫ్ పోలీసులకు పంపించిందా అనేది తెలియాలి అంటే ఆమె స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి వీటన్నింటికీ చెక్ పెట్టాలి అంటే మనోజ్ మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే అని మనోజ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.