BigTV English

Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్.. ఇది ఫ్రూఫ్?

Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్.. ఇది ఫ్రూఫ్?

Rohit Sharma: గత కొంతకాలంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్ లో {Rohit Sharma} తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. రోహిత్ వన్డే క్రికెట్ లో సాధించిన డబుల్ సెంచరీలు, పొట్టి ఫార్మాట్ లో నెలకొల్పిన రికార్డులు చూస్తే అతను {Rohit Sharma} ఎంత స్వేచ్ఛగా పరుగులు రాబడతాడో తెలుస్తోంది. కానీ ఈ మధ్యకాలంలో అతడి ఆటతీరు సరిగ్గా లేదు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లోను రోహిత్ నిరాశపరిచాడు. ఈ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వేదికగా భారత్ 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడుతుంది.


Also Read: ICC WTC 2025 final: మూడో టెస్ట్ డ్రా అయితే.. WTC నుంచి టీమిండియా తప్పుకోవడమేనా ?

ఇందులో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తికాగా.. గత శనివారం నుండి మూడో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి దిగిన రోహిత్ శర్మ {Rohit Sharma} రెండు బౌండరీలు కొట్టి టచ్ లోకి వచ్చినట్లే కనిపించాడు. కానీ కేవలం 10 పరుగులకే వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ లో అలెక్స్ క్యారీ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.


ఇందుకు కారణం ఏంటంటే..? ఈ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ {Rohit Sharma} అవుట్ అయిన తర్వాత ప్రవర్తించిన తీరును కారణంగా చెబుతున్నారు. అవుట్ అయిన తర్వాత తీవ్ర అసంతృప్తికి గురైన రోహిత్ శర్మ.. తన గ్లౌజ్ లను డగౌట్ వద్దే పడేసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ కి కూడా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. 37 ఏళ్ల రోహిత్ తన ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరలోనే ఉందని ఎవరికి నచ్చినట్లు వాళ్లు జోష్యం చెబుతున్నారు.

అయితే గత నెల నవంబర్ లోనే భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ రోహిత్ {Rohit Sharma} రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్ శర్మ విఫలమైతే.. అదే తనకి చివరి టెస్ట్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని గత నెలలోనే ఉన్నాడు. అతనే స్వయంగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని పేర్కొన్నాడు.

Also Read: Travis Head Captaincy: టీమిండియాపై రెచ్చిపోతున్న హెడ్ కు బంపర్ ఆఫర్ !

ఈ ఆస్ట్రేలియ సిరీస్ లో భారత్ పేలవ ప్రదర్శన పట్ల బీసీసీఐ కూడా రోహిత్ శర్మ {Rohit Sharma} పై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అతను ఎలా స్పందిస్తాడు..? రోహిత్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై రోహిత్ శర్మ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×